నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఫేమ్ బాబీ (Bobby) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ శాతం విజయం సాధించాయి. మరోపక్క ‘అఖండ’ నుండి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. దీంతో ‘డాకు మహారాజ్’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మాత నాగ వంశీ (Suryadevara Naga Vamsi) చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ.. ” ‘లెజెండ్’ (Legend) ‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో ఆల్ టైం హిట్లుగా నిలిచాయి. మా ‘డాకు మహారాజ్’ సినిమా వాటికంటే బాగుంటుంది. మీరు ఇంటర్వెల్ సీన్ అవ్వగానే నా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి.. సినిమా అద్భుతంగా ఉంది అని చెబుతారు.
తమన్ యు.ఎస్ వెళ్లే ముందు మాకు ఫస్ట్ హాఫ్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చూపించాడు.. అదిరిపోయింది. నేను బాలకృష్ణ ఫ్యాన్ గా చెబుతున్నా.. బాబీ చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్ అయినప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ కంటే బాగా ‘డాకు మహారాజ్’ తీశాడు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాబీ మాట్లాడుతూ.. ” బాలకృష్ణ గారిని ప్రతి సినిమాలో లౌడ్ గా చూపిస్తూ వచ్చారు. ఆయన సినిమా కోసం ఏదైనా చేసేస్తారు.
డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో దూకేస్తారు, ఎగిరేస్తారు, దెబ్బలు తగిలినా.. గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ షాట్ కి రెడీ అవుతారు. అలా ఆయన మమ్మల్ని భయపెడుతూ ఉంటారు. అలాంటి హీరో ఉన్నప్పుడు ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించి ఆయన్ని అందంగా చూపిస్తే బాగుంటుందని భావించి ‘డాకు మహారాజ్’ ని కొత్తగా తీశాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.