Rahul Ramakrishna: సంధ్య థియేటర్ ఘటన.. రాహుల్ రామకృష్ణ సడన్ ట్విస్ట్!

సూపర్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)  నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule)  ప్రీమియర్‌ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండటం అందరినీ కలచివేసింది. దీంతో ఈ సంఘటనలో బాధ్యులెవరు అనే దానిపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఈ చర్చలో కొత్త మలుపును తెచ్చింది.

Rahul Ramakrishna

తొక్కిసలాట తర్వాత వెంటనే స్పందించి, ప్రభుత్వం, థియేటర్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించిన రాహుల్, ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై పూర్తి వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నారు. తనకు ముందుగా సరైన సమాచారం లేకపోవడంతో కొంత ఉద్రిక్తంగా స్పందించానని, ఇప్పుడు విషయాలు అర్థమయ్యాక తన ట్వీట్‌ను వెనక్కి తీసుకుంటున్నానని రాహుల్ ప్రకటించారు. అయితే రాహుల్ ట్వీట్ యూటర్న్ గా భావించి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు ఆయన మార్పును సానుకూలంగా చూడగా, మరికొందరు ఆయన నిష్పక్షపాత ధోరణిని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన కొన్ని రాజకీయ సభల్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, అలాంటి సందర్భాల్లో ఈ స్థాయిలో చర్చలేం జరగలేదని రాహుల్ (Rahul Ramakrishna) తన మొదటి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ చేసిన ప్రెస్ మీట్ వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని చర్చకు తెరలేపాయి.

బన్నీ అరెస్ట్ సమయంలో రాహుల్ (Rahul Ramakrishna) మద్దతుగా నిలిచి, పబ్లిక్ ప్లేస్‌లో భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన వైఖరిని మార్చుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రాహుల్ తాజా ట్వీట్ తో పాటు, గతంలో చేసిన వ్యాఖ్యలు నెమ్మదిగా వైరల్ అవుతుండటం గమనార్హం. కొన్ని వర్గాల వారు ఆయన స్పందనను రాజకీయ ఒత్తిడితో సంబంధించి చూడగా, మరికొందరు ఆయన అభిప్రాయ మార్పును ఆత్మవిమర్శగా అభివర్ణిస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై రాహుల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

బాలయ్య ఫ్యాన్ గా చెబుతున్నా.. నిర్మాత నాగ వంశీ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus