Prabhas: ఆ షరతులకు స్టార్ హీరో ప్రభాస్ ఒప్పుకుంటారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్ ఏకంగా 800 కోట్ల రూపాయలు కాగా ప్రాజెక్ట్ కే నైజాం హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఆదిపురుష్, ప్రభాస్ మారుతి కాంబో సినిమాలపై పెద్దగా అంచనాలు లేవు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ ప్రాజెక్ట్ ల కోసం ఎక్కువ ఆసక్తితో ఎదురుచూడటం లేదు. అయితే ప్రభాస్ మారుతి కాంబో మూవీని ప్రాజెక్ట్ కే తర్వాతే విడుదల చేయాలని అశ్వనీదత్ ప్రభాస్ కు షరతులు విధించారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ పరిమిత బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమా ముందు విడుదలైతే తన సినిమా బిజినెస్ పై ప్రభావం పడుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

అయితే అశ్వనీదత్ షరతులకు ప్రభాస్ అంగీకరిస్తారో లేదో చూడాలి. భారీ బడ్జెట్ తో నిర్మించడం వల్ల అశ్వనీదత్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. మారుతి సినిమా షూట్ విషయంలో ప్రభాస్ కూడా పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ప్రస్తుతం ఏడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. త్వరలో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ప్రభాస్ స్థాయిలో బిజీగా ఉన్న మరో హీరో దాదాపుగా లేరనే చెప్పాలి

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus