Ravi Shankar: బన్నీ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చిన పుష్ప2 నిర్మాత.. ఏమైందంటే?

ఈ ఏడాది విడుదలవుతున్న భారీ సినిమాలలో పుష్ప ది రూల్ ఒకటి కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2024 సంవత్సరం డిసెంబర్ నెల 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అయితే దేవర(Devara) విషయంలో జరిగిన తప్పు పుష్ప2 (Pushpa 2) విషయంలో జరగదని నిర్మాత వైపు నుంచి హామీ లభించడం గమనార్హం. ఎన్టీఆర్ (Jr NTR)   కొరటాల శివ (Koratala Siva)  కాంబోలో తెరకెక్కిన దేవర మూవీ ఈవెంట్ వేర్వేరు కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.

Ravi Shankar

అయితే పుష్ప2 ప్రమోషన్స్ కు సంబంధించి అలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మేకర్స్ పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర సినిమా ఈవెంట్ కు ఊహించని దాని కంటే దాదాపుగా 2 నుంచి 3 రెట్లు జనాలు వచ్చేశారని పుష్ప2 నిర్మాత రవిశంకర్ (Y. Ravi Shankar) చెప్పుకొచ్చారు. పోలీసులు చాలా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదని అలా జరగడం చాలా దురదృష్టకరం అని రవిశంకర్ కామెంట్లు చేశారు. ఈ ఈవెంట్ కు శ్రీకాకుళం, అనంతపురం నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

దేవరకు మరో ఫంక్షన్ చేయడానికి కూడా వీలు లేదని రవిశంకర్ వెల్లడించారు. ఓవర్సీస్ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిపోయారని ఆయన తెలిపారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పుష్ప2 మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని రవిశంకర్ పేర్కొన్నారు.

పుష్ప ది రూల్ మూవీ ఈవెంట్స్ అన్నీ ఔట్ డోర్ లో ప్లాన్ చేశామని జనం ఎంతమంది వచ్చినా సరిపోయేలా చూసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప2 నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

నా కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ప్రకాష్ రాజ్.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus