Ravinder: మరోసారి వార్తల్లో నిలిచిన ట్రోలింగ్ జంట.. తన బరువు గురించి పట్టించుకోనంటున్న రవీందర్!

ట్రోలింగ్ వల్ల కూడా పాపులర్ అయ్యి సెలబ్రిటీలుగా మారిపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని పాపులర్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాయి. సరిగ్గా ఇలాగే రవీందర్ – మహాలక్ష్మీ ల జంట బాగా పాపులర్ అయ్యారు. నిర్మాత అయిన రవీందర్ తన సినిమాలో నటించిన సహనటి మహాలక్ష్మీ ని పెళ్లి చేసుకోవడంతో.. వీళ్ళ పై ఇండియా వైడ్ ట్రోలింగ్ జరిగింది.రవీందర్ భారీ కాయంతో ఉండటం.. మహాలక్ష్మీ సన్నగా అందంగా ఉండటంతో, డబ్బు కోసమే మహాలక్ష్మీ … రవీందర్ ను పెళ్లి చేసుకుంది అంటూ వీళ్ళపై ట్రోలింగ్ మొదలైంది.

తమ సినిమాలతో నిర్మాత రవీందర్ (Ravinder) కానీ మహాలక్ష్మీ కానీ పాపులర్ అయ్యింది లేదు. కానీ పెళ్లి చేసుకుని పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అయితే రవీందర్ అధిక బరువు గురించి ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. వాటికి ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చాడు. అతను మాట్లాడుతూ.. ‘నేను నా బరువు పై దృష్టి పెట్టను. ఆరోగ్యంగా ఉండడానికి, కెరీర్ పై మాత్రమే దృష్టి పెడతాను. ఈరోజు ఇది తినకూడదు అనే నియమాలు పెట్టుకోను.

నేను డైట్ కూడా చేయడానికి ప్రయత్నించాను అది నా వల్ల కాలేదు. నేను 200 కేజీల బరువు ఉంటాను. నా బరువు నేను మోసుకొవడానికి కూడా చాలా కష్టపడతాను’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. గతంలో ఇతనికి శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరంలో కొవ్వును కరిగించే కణాలు క్షీణించిపోయాయట. అందుకే అతను బరువు పెరగడం జరిగింది. ఊబకాయంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆరోగ్యంపైనే అతను ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus