Mazaka: ‘మజాకా’ కూడా సంక్రాంతికేనా.. నిర్మాత క్లారిటీ ఇదే..!

ప్రతి సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయి అని అంతా అనుకున్నారు. అందులో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) వంటి సినిమాలు ఉన్నాయి. 4వ సినిమాగా అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఉంటుందని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత మైత్రి నవీన్ చెన్నైలో జరిగిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ఈవెంట్లో చెప్పుకొచ్చారు.

Mazaka

‘ఆనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా డిలే అవుతుంది’ అంటూ మైత్రి నవీన్ (Naveen Yerneni)  తెలిపారు. దీంతో 2025 సంక్రాంతికి 3 సినిమాలే రిలీజ్ అవుతాయేమో అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు నాలుగవ సినిమాగా సందీప్ కిషన్ (Sundeep Kishan)  ‘మజాకా’ (Mazaka) రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆ సినిమాని కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని టీం ప్రకటించింది. ఈ విషయంపై ఈరోజు ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ఈవెంట్లో నిర్మాత రాజేష్ దండ (Rajesh Danda) స్పందించారు.

”మజాకా’ ని (Mazaka) సంక్రాంతి రేసు నుండి తప్పించారా?’ అంటూ ఓ రిపోర్టర్ అతన్ని ప్రశ్నించడం జరిగింది. అందుకు రాజేష్ దండ మాట్లాడుతూ.. ‘ కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అది కనుక కంప్లీట్ అయిపోతే’ 2025 సంక్రాంతికే రిలీజ్ చేస్తామని’ చెప్పుకొచ్చారు. ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. సో 4వ సినిమా ప్లేస్లో ‘మజాకా’ వచ్చి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

దేవర 2: ఫ్యాన్స్ కు ఇది కిక్కిచ్చే లీక్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus