‘గాలి సంపత్’ కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం చాలా ఆనందంగా ఉంది: నిర్మాత ఎస్. కృష్ణ

‘గాలి సంపత్’ కు చిన్న చిత్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్ ప్లే చేయడంతో కొత్త గ్లామర్ వచ్చింది. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ ని అనీష్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ సందర్భంగా..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ” నా సమర్పణ, స్క్రీన్ ప్లే తో గాలి సంపత్ ప్రారంభమైంది. ఈ సినిమా మాకెంతో స్పెషల్. అందుకే ఈ చిత్రానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను. చేస్తున్న పని అర్థవంతంగా ఉండాలంటే అది టీమ్ వర్క్ తోనే సాధ్యపడుతుందని నమ్ముతాను” అన్నారు.

నిర్మాత ఎస్. కృష్ణ మాట్లాడుతూ, ” నా మిత్రుడు అనిల్ రావిపూడి ‘గాలి సంపత్’ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలబడడమే కాకుండా స్క్రీన్ ప్లే, సమర్పణ తో పాటూ దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి కూడా అంగీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అనిల్ రావిపూడి గారి ప్రోత్సాహంతో ఆయన క్రియేటివ్ ఇన్వాల్వ్ మెంట్ తో సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. మా బ్యానర్ లో మొదటి సినిమా ‘గాలి సంపత్’ ఈ 2021 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతోంది అనే నమ్మకం మాకుంది. ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి అంగీకరించిన మా మిత్రుడు అనిల్ రావిపూడి కి స్పెషల్ థాంక్స్” అన్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus