Shobu Yarlagadda: ఏపీలో టికెట్‌ ధరలపై స్పందించిన నిర్మాత శోభు!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. గత కొద్ది రోజులుగా రగులుతున్న ఈ నిప్పు గురువారం మరింతగా రాజుకొంది. కథానాయకుడు నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ ప్రచారంలో భాగంగా సినిమా టికెట్‌ ధరల గురించి ప్రస్తావించాడు. దాంతో గురువారం మొదలైన టికెట్‌ పంచాయతి సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. నిర్మాత, ప్రదర్శనకారుడు నట్టి కుమార్‌ కామెంట్స్‌తో మొదలై, సాయంత్రానికి ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కామెంట్‌తో మరింత రాజుకుంది.

ఓవైపు సినిమా వాళ్లు మాట్లాడుతుంటే… మరోవైపు ఏపీ మంత్రులు కొంతమంది దీని మీద స్పందించారు. నాని, నట్టి కుమార్‌ ఏమన్నారో మీరు చూసే ఉంటారు. అయితే శోభు యార్లగడ్డ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ‘MRP’ అని అంటున్నారు. ఎమ్మార్పీను నియంత్రించాల్సిన ప్రభుత్వమే అంటూ ప్రభుత్వ మంత్రులు అంటున్నారు. దీనిపైనే శోభు రియాక్ట్‌ అయ్యారు. దాని గురించి మొత్తం లెక్క విడదీసి చెప్పారు.

టికెట్‌ ధరల తగ్గింపు వ్యవహారం దీర్ఘకాలంలో సినిమా ప్రదర్శన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని శోభు యార్లగడ్డ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. సినిమా టికెట్‌ ధరల విషయంలో నానికి పూర్తి మద్దతు తెలుపుతున్నా అంటూ శోభు ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో ఏపీలో టికెట్‌ ధరల వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమపై దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుంది. ఇదే కొనసాగితే థియేటర్‌ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు.

సినిమా రంగంపై ఆధారపడిన ఎంతోమంది జీవితాలపైనా టికెట్‌ రేట్ల ప్రభావం పడుతుందని అన్నారు శోభు. ఏపీ ప్రభుత్వం సినిమాల ద్వారా పన్నుల రూపంలో ఆదాయం పొందాలనుకుంటే మరికొన్ని పనులు చేయొచ్చు అని సూచించారు కూడా. అన్ని థియేటర్‌లలో వంద శాతం టికెట్‌ అమ్మకాలను కంప్యూటరైజ్డ్‌ చేయొచ్చు. ఆటోమేటిక్‌, రియల్‌టైమ్‌ అప్‌డేట్‌లను కూడా పెట్టొచ్చు. దాని వల్ల ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయి.

టికెట్‌ ధరల విషయంలో ఉచితం, వేరియబుల్‌ ధర లాంటి ఆప్షన్లను కూడా పరిశీలించొచ్చు. అంటే సినిమా బట్టి, రోజుల బట్టి టికెట్‌ ధర ఉండటం. ఇవన్నీ చెబుతూనే… ఎంఆర్‌పీని నిర్ణయించేది ప్రొడ్యూసర్స్‌/వస్తువుల తయారీదారులు మాత్రమే. ప్రభుత్వాలు కాదు అని తేల్చి చెప్పారు శోభు. ఆఖరిగా… టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం నిర్ణయం వల్ల ఏపీలో యాభైకి పైగా సినిమా థియేటర్లు మూత పడినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అంటూ నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus