SKN: పవన్ కళ్యాణ్ కి బండ్ల.. అల్లు అర్జున్ కు ఎస్.కె.ఎన్..!

సినిమా ఈవెంట్లు అనేవి.. ప్రమోషన్ల కోసమే నిర్వహిస్తారు. తమ సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా జనాలకు రీచ్ అవుతుంది అనేది అందరి నమ్మకం. అది నిజం కూడా..! అదే సమయంలో ఇలాంటి వేడుకలకు వేరే సినిమాల నిర్మాతలు కనుక అతిధులుగా విచ్చేస్తే..స్పీచ్ ఇస్తున్నప్పుడు హీరోలను పొగుడుతూ నాన్ స్టాప్ బిస్కెట్లు వేస్తుంటారు. ఎందుకంటే ఆ హీరో కంట్లో పడాలి.. తమకు కాల్షీట్లు ఇచ్చేయాలి.. సినిమా అనౌన్స్ చేయగానే ఫైనాన్షియర్లు వచ్చి డబ్బులు పెట్టేయాలి.

ఇది వాళ్ళ మెయిన్ థీమ్. ఇదే పద్ధతిని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అనుసరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లకు వెళ్తే చాలు..పూనకం వచ్చినట్టు ఊగిపోయి స్పీచ్ లు ఇస్తుంటాడు. పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. బండ్ల తన స్వలాభం కోసం అలా మాట్లాడినా.. అవి పవన్ అభిమానులకు మంచి కిక్ ఇస్తూ ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ లకు బండ్ల గణేష్ అతిథిగా రావాలని పవన్ అభిమానులు గట్టిగా కోరుకుంటూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఉన్నట్లు.. మరో హీరోకి ఇలా ఎవ్వరూ లేరే అని అంతా ఇప్పటివరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు నిర్మాత ఎస్.కె.ఎన్ మరో బండ్ల గణేష్ లా మారాడు అన్నది నెటిజెన్ల మాట. అయితే ఎస్.కె.ఎన్.. మరో బండ్ల గణేష్ లా మారింది పవన్ కళ్యాణ్ కు కాదు.. అల్లు అర్జున్ కు..! అవును నిన్న జరిగిన ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎస్.కె.ఎన్ స్పీచ్ వింటే.. ఇది ఎవ్వరైనా ఒప్పుకుంటారు.’ ‘పుష్ప 1’ రిలీజ్ అయ్యింది కాబట్టి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..

‘పుష్ప 2′ రిలీజ్ అయ్యాక పాన్ వరల్డ్ స్టార్ అల్లు అర్జున్’ అన్నట్టు హై ఇచ్చాడు ఎస్.కె.ఎన్. ఇతను మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతున్న విజువల్ చూస్తుంటే.. అందరికీ పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ విజువల్స్ గుర్తుకురావడం ఖాయమనే చెప్పాలి.గతంలో కూడా అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లలో ఇలాగే బిస్కట్లు వేశాడు ఎస్.కె.ఎన్. ‘గీతా ఆర్ట్స్’ ‘యూవీ క్రియేషన్స్’ వంటి బ్యానర్లలో ఇతను సహా నిర్మాతగా ఉండి సినిమాలు చేస్తుండేవాడు. ఇప్పుడిప్పుడే సినిమాలను కూడా నిర్మిస్తూ బిజీగా గడుపుతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగాలి అన్నది ఇతని డ్రీం అనుకుంట.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus