Suresh Babu: కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేసిన సురేష్ బాబు… ప్రశంసలు కురిపిస్తున్న నేటిజన్స్!

  • January 3, 2023 / 07:02 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సురేష్ బాబు గురించి అందరికీ సుపరిచితమే అయితే తాజాగా ఈయన హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుగా మారిపోయారు. హైదరాబాదులో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల గురించి మనకు తెలిసిందే. ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో అదే దారిలో ప్రయాణిస్తున్నటువంటి సురేష్ బాబు కారు దిగి అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులకు సూచనలు చేస్తూ ఆయన ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు. ఈ విధంగా సురేష్ బాబు బాధ్యత గల పౌరుడిగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోలు పై ఎంతో మంది నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు. సురేష్ బాబు నిర్మాతగా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఈయన బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించడంతో ఈయన చేసిన పని పట్ల నేటిజన్స్ ప్రశంసలు కురిపించారు.

ఇంకా గత కొన్ని దశాబ్దాలుగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సురేష్ బాబు ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. సురేష్ బాబు ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయి నిర్మాతగా ఏ సినిమాలను నిర్మించలేదు. ఇతర సంస్థలతో భాగస్వామ్యం అయ్యి సినిమాలను నిర్మిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus