The Raja Saab: రాజ్ సాబ్ లుక్ గురించి నిర్మాత క్లారిటీ ఇదే.. ఏం చెప్పారంటే?

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ నుంచి తాజాగా పోస్టర్ రిలీజ్ కావడంతో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ లుక్ ను చూసిన ప్రేక్షకులలో కొందరు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏఐతో క్రియేట్ చేశారని కామెంట్ చేశారు. అయితే ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కల్కి సినిమా విజువల్ ఎఫెక్స్ట్ తో రాజాసాబ్ మూవీని పోల్చలేమని ఆయన అన్నారు.

ఈ సినిమాలలో ఏ సినిమాకు ఆ సినిమా స్పెషల్ అని పేర్కొన్నారు. రాజాసాబ్ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజాసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటివరకు 45 శాతం పూర్తైందని విశ్వప్రసాద్ కామెంట్లు చేశారు. డైరెక్టర్ మారుతి సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ ఏఐతో క్రియేట్ చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

2022 సంవత్సరం నవంబర్ నెలలో రాజాసాబ్ లుక్ కు సంబంధించిన షూట్ జరిగిందని విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. హీరో రోల్, గెటప్ గురించి అన్ని విషయాలను వెల్లడించడం సులువు కాదని ఆయన పేర్కొన్నారు. రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాజా సాబ్ విడుదలైతే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు.

గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలేవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాలేదు. రాధేశ్యామ్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. రాజాసాబ్ (The Raja Saab) మాత్రం చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus