మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించినటువంటి ఈగల్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు ప్రమోషన్లకు రానటువంటి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన బ్యానర్ నుంచి వరుసగా 15 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వాటిని విజయవంతంగా విడుదల చేయడం కోసమే తాను రంగంలోకి దిగానని తెలిపారు.
సినిమాలు చేయడం ముఖ్యం కాదు వాటిని విజయవంతంగా విడుదల చేయడం కూడా ముఖ్యమని ఈయన వెల్లడించారు. ఇక ఈగల్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు. 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా చేస్తే ఎంత పిక్చర్ క్వాలిటీ ఉంటుందో అదే క్వాలిటీ ఈగల్ సినిమాకు ఉందని తెలిపారు.
తక్కువ బడ్జెట్ తో 100 కోట్ల పిక్చర్ క్వాలిటీని తీసుకువచ్చామని తెలియజేశారు. ఇక ఈ సినిమా (Eagle Movie) సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా అలా సంక్రాంతికి విడుదల కాకపోవడం ఇండస్ట్రీకి మంచిదైందని మాకు మాత్రం బ్యాడ్ కాలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!