Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Vamsi: నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత నాగ వంశీ

Naga Vamsi: నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత నాగ వంశీ

  • October 23, 2023 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత నాగ వంశీ

ఇటీవల కాలంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సినిమా ఇండస్ట్రీలో జరిగే ఎలాంటి విషయాన్ని నైనా సరే నిర్మొహమాటంగా చెప్పే నిర్మాతల్లో ఆయన ముందు వరుసలో నిలుస్తారు. ఎలాంటి విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెబుతుంటారు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు.

ఈ సినిమా సక్సెస్ లో భాగంగా ఇటీవల ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఆయన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలలో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి నిర్మాతలకు డబ్బులు రాలేదని ఇటీవల ఆ సినిమా హీరో నానిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో నిర్మాత నాగ వంశీ దగ్గర కూడా ప్రస్తావించారు.

ఈ విషయం పైన ఆయన (Naga Vamsi) కాస్త ఘాటుగానే స్పందించారు. అసలు మీడియాకు తెలిసే లెక్కలన్నీ నిజాలు కాదని అవన్నీ కేవలం పుకార్లని తెలియజేశారు. అసలు నిర్మాతలు లెక్కలన్నీ ఎందుకు బయటికి చూపెడతారంటూ ప్రశ్నించారు. సినిమా హిట్టా ఫట్టా అనే విషయంపై మీడియాకు ఓ వార్తను వదిలిపెడతామని.. మేము చేసే వ్యాపారాన్ని రోడ్డుమీద ఎందుకు పెట్టుకుంటామన్నారు.. ఎవరికివారు తోచిన విధంగా వారు ఫిగర్ ను బట్టి మీడియా ప్రతినిధులు రాసుకుంటూ ఉంటారని నాగవంశీ అన్నారు.

అసలు విషయాన్ని మాత్రం ఏ ఒక్క నిర్మాత ఇప్పటి వరకు మీడియా ప్రతినిధులకు చెప్పలేదన్నారు. ఇక సినిమా నిర్మాణ సంస్థలు వేసే పోస్టర్ల విషయంపై కూడా ఆయన మాట్లాడారు. తీసిన సినిమాకు నేను ఎంత బిజినెస్ చేశానో.. ఎంత ఖర్చు చేశాను.. ఎంత వసూలు చేసిందన్న విషయాలు ఎందుకండి జనాలకు.. అది తలనొప్పి యవ్వారం. సినిమా తీసిన నాకు పోయినా ఎవరూ ఇవ్వరు. ఒక హీరోని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ అంటూ పోస్టర్ల మీద వేసే కలెక్షన్స్ గురించి కామెంట్ చేశారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi

Also Read

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

trending news

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

19 mins ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

50 mins ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

5 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

6 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

24 hours ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

1 hour ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

2 hours ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

24 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

1 day ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version