పద్ధతి మార్చుకుంటున్న నిర్మాతలు!

  • June 4, 2021 / 03:38 PM IST

సాధారణంగా హీరోలకు సినిమాకి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తుంటారు నిర్మాతలు కొన్నాళ్లక్రితం వరకు ఇదే పద్ధతి నడిచింది. కానీ ఈ మధ్యకాలంలో హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. దీని వలన ప్రొడక్షన్ ఖర్చులు తగ్గుతున్నాయి. అలానే హీరోలకు వచ్చే ప్రాఫిట్ కూడా బాగా పెరిగింది. దీంతో హీరోలు ఈ పద్దతినే ఫాలో అవుతూ భారీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో పవన్ కూడా ఇలానే చేసి ఎక్కువ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు.

నిజానికి పవన్ కి నాలుగేళ్ల క్రితం పాతిక కోట్లను రెమ్యునరేషన్ గా ఇచ్చేవారు. కానీ ‘వకీల్ సాబ్’కి ఆయన యాభై కోట్లు అందుకున్నాడు. దానికి కారణం సినిమాకి వచ్చిన ప్రాఫిట్స్ లో వాటా తీసుకోవడమే అని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా తన బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తూ లాభాల్లో వాటా అందుకుంటున్నారు. ఇకపై ఈ పద్దతికి స్వస్తి చెప్పాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట .

లాభాల్లో హీరోలకు ఎక్కువ వాటాలు ఇస్తుండడంతో నిర్మాతలకు మిగిలే లాభం చాలా తక్కువగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇక నుండి కూడా లాభాల్లో వాటా ఇవ్వకుండా ముందుగా రెమ్యునరేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. మరి ఈ పద్దతిని ఎంత వరకు ఫాలో అవుతారో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus