ఇద్దరు హీరోల వల్ల ఆహా ఓటీటీ రేంజ్ మారిపోయిందా?

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమైన షో ఏంటనే ప్రశ్నకు అన్ స్టాపబుల్ షో పేరు సమాధానంగా వినిపిస్తుంది. బాలయ్య హోస్టింగ్ ఈ షో సక్సెస్ లో కీలక పాత్ర పోషించగా అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. చంద్రబాబు, పవన్, ప్రభాస్ ఎపిసోడ్లు అన్ స్టాపబుల్ సీజన్2 సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.

ఈ ఎపిసోడ్లకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయనే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ సీజన్2 ముగియనుంది. ప్రభాస్, పవన్ ఎపిసోడ్ల ద్వారా ఆహాకు 17 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం. సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో పాటు బ్రాండ్స్ ప్రమోషన్ల ద్వారా ఈ షోకు ఆదాయం పెరుగుతోందని కమెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు ఈ షోలకు హాజరైన గెస్ట్ లకు ఖరీదైన బహుమతులు ఇస్తున్నారని తెలుస్తోంది.

రెమ్యునరేషన్ కు బదులుగా ఈ కానుకలను ఇస్తున్నారని సమాచారం. అన్ స్టాపబుల్ స్థాయిలో మరో టాక్ షో హిట్ కావడం కూడా కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య షోకు ఎన్టీఆర్ హాజరైతే చూడాలని అభిమానుల ఆకాంక్ష కాగా ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఎన్టీఆర్ కలిసి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అరవింద సమేత వీర రాఘవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై సందడి చేశారు. బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ ఉందని కొంతమంది ప్రచారం చేసినా ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ సీజన్3 కూడా ఉండనుందని తెలుస్తోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus