2021.. జనవరిలో విడుదలైన సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్..!

2020 సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబులు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశారు.అవును ఆ ఏడాది సంక్రాంతి కానుకగా ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు పాన్ ఇండియా సినిమాల స్థాయిలో కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించాయి. దాంతో పెద్ద దిష్టే తగిలినట్లుంది. మార్చి ఎండింగ్ నుండీ కరోనా ఎంట్రీతో థియేటర్లు మూతపడ్డాయి. 9 నెలల పాటు మళ్ళీ తెరుచుకోనే లేదు. ఎట్టకేలకు డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో థియేటర్లు తెరుచుకున్నాయి.

అయినా కరోనా భయంతో జనాలు థియేటర్లకు వస్తారా అనే అనుమానం అందరిలోనూ ఉంది. వాటిని పటాపంచలు చేస్తూ ఆ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో 2021 సంక్రాంతికి 4 సినిమాలు విడుదలయ్యాయి. అందులో రవితేజ ‘క్రాక్’, తమిళ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’, రామ్ నటించిన ‘రెడ్’ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ల ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలు వంటివి విడుదలయ్యాయి. ఒక్క ‘అల్లుడు అదుర్స్’ చిత్రం యావరేజ్ గా నిలువగా.. మిగిలిన మూడు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి.

అంతేకాకుండా జనవరి చివర్లో అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’, ప్రదీప్ ల ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. వీటిలో అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం హిట్ గా నిలవడమే కాకుండా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఏమైనా 2021 జనవరి బాక్సాఫీస్ కు శుభారంభాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus