Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ప్రముఖ సంగీత దర్శకులు తమన్ చేతులు మీదుగా మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని నటించిన ‘అర్థం’ ఫస్ట్‌లుక్ విడుదల

ప్రముఖ సంగీత దర్శకులు తమన్ చేతులు మీదుగా మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని నటించిన ‘అర్థం’ ఫస్ట్‌లుక్ విడుదల

  • August 17, 2021 / 09:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ సంగీత దర్శకులు తమన్ చేతులు మీదుగా మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని నటించిన ‘అర్థం’ ఫస్ట్‌లుక్ విడుదల

‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్… అజయ్, ఆమని, సాహితీ అవంచ, ‘వైశాలి’ ఫేమ్ నందన్ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వ మూవీ మేకర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు తమన్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా విజయవంతకం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ “ఫస్ట్‌లుక్ విడుదల చేసిన తమన్ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తాం. మణికాంత్ తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగులో ‘ఖైదీ’కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు” అని అన్నారు.

దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ “కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా – ‘అర్థం’. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు” అని అన్నారు.

అజయ్, శ్రద్దా దాస్, ఆమని, మహేంద్ర, సాహితీ అవంచ, నందన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, మాటలు-పాటలు: రాకేందు మౌళి, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, పోరాటాలు: నందు – అంజి – డైమండ్, ఛాయాగ్రహణం: పవన్ చెన్నా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సహ నిర్మాతలు: పవన్, వెంకట రమేష్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, రచన-కూర్పు-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Amani
  • #Mahendra
  • #Manikanth Thalaguti
  • #Nandan

Also Read

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

23 mins ago
Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

32 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

4 hours ago
Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

5 hours ago
Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

6 hours ago

latest news

Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

5 mins ago
Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

15 mins ago
Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

3 hours ago
Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

19 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version