Samantha: ‘యశోద’కు ఇది పెద్ద దెబ్బే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. చాలా కాలం తరువాత ఆమె నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా ఒకటి థియేటర్లో సందడి చేయబోతుంది. అదే ‘యశోద’. తెలుగులో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్ధ్యం ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. ‘యశోద’కి మెయిన్ ఎట్రాక్షన్ సమంతనే. ఇదివరకు ఆమె ‘ఓ బేబీ’, ‘యూటర్న్’ వంటి సినిమాలతో సత్తా చాటింది.

అందుకే ఆమెపై భారీ బడ్జెట్ పెట్టి ‘యశోద’ సినిమాను తీశారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా సమంతకు పాపులారిటీ ఉంది కాబట్టి ఈ సినిమా అన్ని చోట్లా వర్కవుట్ అవుతుందనే ఆశిస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ పెరిగింది. అన్నీ ఉన్నప్పటికీ.. రిలీజ్ డేట్ దగ్గరపడే సమయానికి సమంత అందుబాటులో లేకపోవడంతో సినిమాకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

ఈరోజుల్లో సినిమాకి హైప్ పెంచడంలో ప్రీరిలీజ్ ప్రమోషన్స్ చాలా ముఖ్యం. అందులోనూ ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రమోషన్స్ కంపల్సరీ. గత ఏడాది కాలంలో సమంత వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల వలన తను మీడియా ముందుకొస్తే క్యూరియాసిటీ పెరుగుతుంది.

ఆమెతో మాట్లాడాలని మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ ఇప్పుడు సమంత ఆరోగ్యం బాలేదు. ప్రస్తుతం ఆమెని ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు ఆమె కోలుకొని ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ప్రమోషన్స్ లేకుండా.. కేవలం కంటెంట్ తో ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూద్దాం!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus