Inaya Sultana: ఇనయ ఎలిమినేషన్ లో జరిగిందేంటి ? బిగ్ బాస్ టీమ్ పై పబ్లిక్ ఫైర్..!

బిగ్ బాస్ రియాలిటీ షోలో 14వ వారం ఇనయా ఎలిమినేషన్ పై పబ్లిక్ మండిపడుతున్నారు. అసలు అన్ అఫీషియల్ ఓటింగ్ లో దూసుకుపోతున్న ఇనయాని ఎందుకు ఎలిమినేట్ చేశారంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే బిగ్ బాస్ టీమ్ రేవంత్ ని విన్నర్ చేసేందుకు, పోటీ ఏదీ లేకుండా చేశారా ? లేదా, ఇనయా ఎలిమినేషన్ వెనక పెద్ద కుట్ర చేశారా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇనయా ఫస్ట్ మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోవాలి.

అస్సలు ఎలాంటి పబ్లిక్ రిలేషన్స్ కానీ, సోషల్ మీడియాలో క్రేజ్ కానీ లేని ఇనయా 14 వారాలు హౌస్ లో ఉందంటే అది మాములు విషయం కాదు. అంతేకాదు, ఈ సీజన్ లో లేడీటైగర్ గా తన మార్క్ గేమ్ ని ఆడియన్స్ కి రుచి చూపించింది. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించింది. అలాంటి ఇనయాని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ బిగ్ బాస్ టీమ్ పై పబ్లిక్ ఫైర్ అయిపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం లాస్ట్ వరకూ ఆదిరెడ్డి ఇంకా ఇనయా ఇద్దరూ ఉన్నారు. నిజానికి ఇనయాకి ఓటింగ్ లో మంచి పర్సెంటేజ్ వచ్చింది. కానీ, అఫీషియల్ గా మాత్రం ఓటింగ్ రాలేదని, ఓట్లు పడలేదని బిగ్ బాస్ టీమ్ ఇంటికి పంపించేసింది. ఆదిరెడ్డి ని కాపాడాలని, అలాగే శ్రీసత్య – కీర్తి ఇద్దరినీ కూడా చివరి వరకూ ఉంచాలని బిగ్ బాస్ టీమ్ ఇలా చేసిందా ? ముందుగానే కొంతమంది పార్టిసిపెంట్స్ కి ఫినాలే వరకూ తీసుకుని వెళ్తామని చెప్పారా ?

అసలు తెరవెనుక ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. అంతేకాదు, హోస్ట్ గా నాగార్జున ఇక పనికిరాడని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత అన్యాయమైన ఎలిమినేషన్ ఏ సీజన్ లోనూ జరగలేదని, RIPBB6 అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇనయా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లో ఉండటమే చాలా గొప్పవిషయం. ఇప్పుడు టైటిల్ రేస్ లో కూడా ముందుకు దూసుకుపోతోంది. రేవంత్ కి గట్టి పోటీ ఇస్తుందనే అనుకున్నారు అందరూ.

కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఎలిమినేట్ చేసేసరికి నెటిజన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ , ఇనయా ఫాలోవర్స్ అందరూ మండిపడుతున్నారు. కేవలం రేవంత్ ని విన్నర్ చేయడానికే ఇలా చేస్తున్నారా ? ఇదే బిగ్ బాస్ ప్లాన్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇనయ ఎలిమినేషన్ సోషల్ మీడియాలో సన్సేషనల్ అయ్యింది. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus