బెడ్ రూమ్ వేర్ తో రోడ్డుపైకి వచ్చిన శ్రీదేవి కుమార్తె!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కి ఈ మధ్య వార్తల్లో కెక్కడం కామన్ అయిపోయింది. దఢక్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే వందకోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరో అద్భుతమైన కథల ఎంపికలో బిజీగా ఉంది. అంతేకాకుండా ఫ్యాషన్ డ్రసులతో పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తోంది. ఆమె కొన్ని రోజుల క్రితం వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ స్టైలిష్ డిజైనర్ వేర్ కి మాత్రం మైనస్ మార్కులు వచ్చాయి. ఆ డ్రస్ మీద కోట్ వేసి .. కింద ప్యాంట్ వేయకపోవడంతో అసహ్యంగా కనిపించింది. ఆ విషయాన్ని చెబుతూ ఆమెను నెటిజనులు ట్రోల్ చేశారు.

తాజాగా మరోసారి ప్యాంట్ వేసుకోకుండా వార్తల్లో నిలిచింది. రోజ్ టాప్.. మైక్రో నిక్కర్ వేసుకుని రోడ్డుమీదకు వచ్చిన ఆమెను  చూసి అభిమానులు కళ్లప్పగించి చూస్తుండిపోతే.. మరికొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా? అని ఆమెని అడుగుతున్నారు. బెడ్‌రూమ్‌ వేర్ తో రోడ్డుపైకి వస్తే కుర్రాళ్ళ మతి ఏమైపోను అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విమర్శలను లెక్క చేయని జాన్వీ.. తాను గ్లామర్ రోల్స్ కి సిద్ధమంటూ దర్శకనిర్మాతలకు ఇలా హింట్ ఇస్తోంది. బాలీవుడ్ స్థాయిలో సినిమాలని నిర్మిస్తున్న టాలీవుడ్ జాన్వీ కి ఎప్పుడు ఆహ్వానం పలుకుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus