భాషతో సంబంధం లేకుండా తన నటనతో, మంచితనంతో అభిమానులకు దగ్గరైన సెలబ్రిటీలలో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా దూరమైనా ఫ్యాన్స్ హృదయాల్లో మాత్రం ఆయన జీవించే ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా గంధర గుడి గతంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయినా కొన్ని కారణాల వల్ల అమెజాన్ ప్రైమ్ తమ ఓటీటీ నుంచి ఈ సినిమాను తొలగించడం జరిగింది. యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐ ట్యూన్స్/ఆపిల్ టీవీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
100 రూపాయలు ఖర్చు చేసి అద్దె చెల్లించడం ద్వారా ఈ సినిమాను చూసే అవకాశం అయితే ఉంటుంది. గంధరగుడి డాక్యుమెంటరీ ఫిల్మ్ కాగా పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అమోఘవర్ష జేఎస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ప్రముఖ స్టార్ మ్యూజి డైరెక్టర్లలో ఒకరైన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. పునీత్ రాజ్ కుమార్ సినీ కెరీర్ లో ఒక మంచి సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది. అప్పట్లో టైటిల్ లైసెన్స్ సమస్యల వల్ల అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను తొలగించడం జరిగింది. కర్ణాటక ప్రకృతి వనరుల గొప్పదనాన్ని ప్రస్తావిస్తూ ఈ డాక్యుమెంటరీని తీశారని తెలుస్తోంది.
వేర్వేరు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం పునీత్ (Puneeth Rajkumar) అభిమానులకు తీపికబురు అనే చెప్పాలి. పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా కావడంతో పునీత్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను వేర్వేరు ఫ్లాట్ ఫామ్స్ లో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు పునీత్ రాజ్ కుమార్ ను తలచుకుని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.