Puneeth Rajkumar: విధిరాతను ఎవ్వరూ మార్చలేరన్న పునీత్!
- October 30, 2021 / 10:54 AM ISTByFilmy Focus
46 సంవత్సరాల వయస్సులో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మృతిని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మృతికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే గతంలో చావు, డెస్టినీ గురించి పునీత్ రాజ్ కుమార్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతాన్ని వెనక్కు తీసుకురాలేమని భవిష్యత్తు మన చేతిలో లేదని పునీత్ రాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
విధి రాతను ఎవరూ మార్చలేరని ఎలా ఉంటే అలా జరుగుతుందని పునీత్ రాజ్ కుమార్ గతంలో చెప్పిన మాటలు నెట్టింట చర్చనీయాంశం అవుతున్నాయి. పునీత్ మరణ వార్త నిజం కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్లీజ్ పునీత్ తిరిగి రా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఈ చేదు వార్తను నమ్మలేకపోతున్నామని చిన్న వయస్సులోనే పునీత్ రాజ్ కుమార్ దూరమవుతాడని ఊహించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పునీత్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పునీత్ తో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలతో పునీత్ రాజ్ కుమార్ కు విడదీయరాని అనుబంధం ఉంది. కన్నడనాట అభిమానులు దేవుడిలా కొలిచే పునీత్ రాజ్ కుమార్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
ನೆನಪುಗಳು ಮಾತ್ರ ಇನ್ನು ಅಮರ !
Still Can’t Digest this News ,
Appu Sir 💔We Miss U Appu Sir !😥 #RIPPunneethRajkumar#PuneethRajkumar pic.twitter.com/qhv8ynDi9R
— ActressSreeleela (@ActressSLeela) October 30, 2021
నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?

















