స్టార్‌ డైరక్టర్‌ అలా ఎందుకన్నాడంటే?

‘‘ఎలా తినాల్సినవాటిని అలా తినాలి, అలా కాదని ఇంకోలా తింటే.. మనిషిలా ఉండాల్సిన మనం, మరోలా తయారవుతాం’’ ఏంటి ఇదంతా కన్‌ఫ్యూజ్‌గా ఉందా? ఇలా కన్‌ఫ్యూజ్‌ అవ్వకుండా ఫుల్‌ క్లారిటీతో టాప్‌ డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌ మ్యూజింగ్‌ రిలీజ్‌ చేశాడు. సమాజం గురించి తన తూటాల మాటలతో వివరించే పూరి.. ఈ సారి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ గురించి చెప్పాడు. ప్రతి మ్యూజింగ్‌లో చెంప చెల్లుమనిపించే పూరి, మరి మనుషుల ఆహారపు అలవాట్లు గురించి ఏం చెప్పాడంటే?

‘‘ఒకప్పుడు మనుషులు సముద్రంలో బతికేవాళ్లు. ఉభయచరంగా మారి, భూమి మీద పాకుతూ, క్రమంగా మనుషులయ్యారు. ఈ క్రమంలో సముద్రానికి, ఉప్పుకు దూరమయ్యారు. రోజూ వేటాడటం కష్టమవుతోందని వ్యవసాయం మొదలెట్టారు. పాలు, మాంసం కోసం జంతువుల్ని పెంచుతున్నారు. ఆహారం స్టాక్‌ చేయడానికి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ మొదలెట్టారు. చేపలు, మాంసం, కూరగాయలు ఎండబెడుతున్నారు. వాటికి ఉప్పు, నూనె కలిపితే బ్యాక్టీరియా రాదని తెలుసుకొని పచ్చళ్లు చేస్తున్నారు. వేపుడు, చెకోడీలు, పకోడీలు, అప్పడాలు.. ఇలా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో. ఆఖరికి విత్తనాల్ని కూడా పొడిచేసి, దాచుకోవడం మొదలెట్టాడు’’ అంటూ ఫుడ్‌ ఎలా మారిందో చెప్పాడు పూరి.

ప్రాసెస్డ్‌ ఫుడ్‌ గురించి చెబుతూ ‘‘ప్రాసెస్డ్‌ అంటే.. సహజంగా ఉన్న ఆహారాన్ని అసహజ పద్ధతిలో ఇంకో రూపంలోకి మార్చడం. ఇలాంటి ఆహారాన్ని శరీరం తేలిగ్గా భరించలేదు. వీటిని తినడానికి తగ్గట్టుగా శరీరం సిద్ధమవ్వలేదు. ఒక్కసారిగా ఆహారాన్ని మార్చేశాం కానీ శరీర నిర్మాణం, జీర్ణ వ్యవస్థ మారలేదు. అందుకే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తిన్నప్పుడు శరీరం దాన్ని ఆహారం అనుకోదు. వేరే ఏదో పదార్థం వచ్చింది అనుకుంటుంది. అయితే చూద్దాం, ప్రయత్నిద్దాంలే అనుకుంటుంది. రెండు లక్షల సంవత్సరాలుగా శరీరానికి చెరకు గడ తినడమే తెలుసు. ఆరడుగల చెరకు గడ తింటే రెండు స్పూన్ల చక్కెర వస్తుందని మాత్రమే తెలుసు. కానీ మనం షుగర్‌ ఫ్యాక్టరీలు పెట్టి, రెండు చెంచాల చక్కెరను ఒకేసారి లోపల వేస్తున్నాం. శరీరం కంగారు పడుతుంది. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ నాలుగు చెంచాలు వేస్తే శరీరానికి భయం. ఎందుకంటే మనం విత్తనాల నుండి ఆయిల్‌ తీస్తున్నామని, ఫ్యాక్టరీలు పెట్టామని దానికి తెలియదు. ఇది సహజమైన ఆహారం కాదనుకుంటుంది. ఆలూ చిప్స్‌ తిన్నా అంతే.. దానికి అర్థం కాకపోయినా ఏదో ప్రయత్నిస్తుంటుంది పాపం’’ అని చెప్పారు.

‘‘ఇలా శరీరాన్ని తికమకపెట్టే ఆహారాన్ని మనం ఎక్కువగా కనిపెడుతున్నాం. వీటి వల్ల డయాబెటిక్స్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌, హైపర్‌ టెన్షన్‌ లాంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోయాయి. అందుకే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సింపుల్‌ రూల్‌ ఏంటంటే.. త్వరగా పాడైపోయే ఆహారం మంచిది. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే ఇది పాడైపోద్ది అనుకుంటే అది మంచి ఆహారం. ఈ ఫుడ్‌ బయటున్నా, పాడవదంటే అది చెడ్డది. ఆహారం పాడైపోయిందంటే.. బ్యాక్టీరియా దానిని తినడం మొదలు పెట్టిందని అర్థం. జంతికలు, చెకోడీలు, పచ్చళ్ల వైపు బ్యాక్టీరియా కన్నెత్తి కూడా చూడదు. బ్యాక్టీరియానే వద్దు అనుకున్న ఆహారం మనకు ఎందుకు? బ్యాక్టీరియా ఏం తింటే మనమూ అదే తిందాం’’ అంటూ ఆహారపు అలవాట్ల గురించి చెప్పాడు. చూద్దాం.. ఎంతమంది ఆయన మాట వింటారో.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus