Puri Jagannadh, Vijay Devarakonda: బాలీవుడ్‌.. ఊపిరి పీల్చుకో మావోడు వస్తున్నాడు!

క్రికెటర్ల విషయంలో ఫామ్‌ అనే మాట వింటూ ఉంటాం. బాగా ఆడుతున్న స్టార్‌ క్రికెటర్‌కి ఏమవుతుందో ఏమో కానీ, ఒక్కసారి ఫామ్‌ కోల్పోయి తక్కువ పరుగులకే ఔట్‌ అవుతూ ఉంటాడు. అలా ఒకరు ఉంటనే జట్టు విజయాల మీద ప్రభావం పడుతుంది. అలాంటిది జట్టు జట్టు మొత్తం ఇదే పరిస్థితి అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. దీనికి సినిమాటిక్‌ ఉదాహరణ చెప్పాలంటే ఆ టీమ్‌ బాలీవుడ్‌లా ఉంటుంది అనొచ్చు. వరుస విజయాలతో దూసుకుపోయిన బాలీవుడ్‌ ఇప్పుడు స్లో అయిపోయింది.

స్టార్‌ దర్శకులు, హీరోలు వచ్చినా విజయాలు అందుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు వారికి మంచి హిట్‌, భారీ వసూళ్లు కావాలి. బాలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటీ విజయం సాధించలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ తొలి విజయం కాగా, చిన్న సినిమాలుగా వచ్చిన ‘భూల్‌ భులయ్యా 2’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘ జుగ్‌ జుగ్‌ జీయో’ మంచి విజయాలు అందుకున్నాయి. అవి కాకుండా భారీ విజయాలు లెక్క చూసుకుంటే అన్నీ సౌత్‌ నుండి అక్కడికెళ్లిన పాన్‌ ఇండియా సినిమాలే.

దీంతో బాలీవుడ్‌కి అర్జెంట్‌గా ఓ హిట్‌ కావాలి అనే మాట కచ్చితంగా వినిపిస్తోంది. హిట్‌ కంటే బ్లాక్‌బస్టర్‌ కావాలి. పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌ కరణ్‌ జోహార్‌ నిర్మించిన సినిమా ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ బాలీవుడ్‌ సినిమా (?) మీదే ఇప్పుడు బాలీవుడ్‌ చూపంతా ఉంది. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకులు, హీరోలు చేస్తున్న హిందీ సినిమాలు ఇలా వచ్చి, అలా వెళ్లిపోతున్నాయి.

దీంతో పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండల సినిమా అయినా తమ కష్టం తీరుస్తుందేమో అని చూస్తున్నారని బాలీవుడ్‌ మీడియా గుసగుస. అదేంటి ‘లైగర్‌’ తెలుగు సినిమా కదా అంటారా. మీరు అనుకున్నది కరెక్టే. అది సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు. ఇప్పుడు చిత్రబృందం వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. అది బాలీవుడ్‌ సినిమాలో తెలుగులోనూ వస్తోంది అనేలా ఉంది. సినిమా నిర్మాణ శైలి, చేస్తున్న ప్రచారం.. ఇలా అన్నింటా బాలీవుడ్‌ వాసనలే వినిపిస్తున్నాయి.

నిర్మాతలు కూడా అక్కడివారే. ఇప్పటివరకు తెలుగులో ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఈవెంట్‌ కూడా జరగలేదు. మొన్నీ మధ్య ట్రైలర్‌ లాంచ్‌ చేశారు కదా అంటారా? మామూలుగా తెలుగు సినిమా ట్రైలర్‌ లాంచ్‌లు ఎలా జరుగుతాయి, ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఎలా జరిగింది అనేది చూసుకుంటే విషయం మీకే అర్థమైపోతుంది. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా దేశాన్ని 25న షేక్‌ చేస్తాం అని విజయ్‌ దేవరకొండ మాట ఇచ్చారు కూడా. దీంతో ఆ షేకింగ్‌ కోసం బాలీవుడ్‌ కూడా ఎదురుచూస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus