ఇజం తర్వాత చేయనున్న సినిమాలపై క్లారిటీ

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోయిజాన్ని పెంచే పనిలో స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై  కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ల గురించి మీడియాకు వివరించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మళ్లీ సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ హీరోలతో డైరక్టర్ చేసిన పోకిరి, టెంపర్ సూపర్ హిట్ గా నిలిచాయి. తన కెరీర్ లో బెస్ట్ చిత్రాలుగా నిలిచిపోయే హిట్లు ఇచ్చిన హీరోల కోసం కథలను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే ముందుగా ఏ హీరో మూవీ తెరకెక్కనుందో.. ఆ విషయాన్ని పూరి చెప్పలేదు. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ ఎవరితో సినిమా చేస్తారో.. ఇంతవరకు ప్రకటించలేదు. పూరి జగన్నాథ్ మాటలను బట్టి చూస్తే, ఈ డైరక్టర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ మూవీ చేయనున్నట్లు అర్ధమవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus