వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ చూసిన డైరెక్టర్ పూరి రియాక్షన్…!

  • January 3, 2020 / 06:44 PM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సారి విజయ్ నలుగురు అమ్మాయిలతో రొమాన్స్ చేయనున్నారు విజయ్ . రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థెరిస్సా మరియు ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తుందా భిన్నమైన నేపధ్యాలు కలిగిన యువకుడిగా వారితో వివిధ గెటప్స్ లో దర్శనమిస్తున్నాడు. కాగా నేడు ఈ చిత్ర టీజర్ విడుదల అయ్యింది. ముద్దు గుమ్మలతో హీరో సాగించే సీరియస్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కాగా ఈ టీజర్ చూసిన డైనమిక్ డైరెక్టర్ పూరి టీజర్ పై ప్రసంశలు కురిపించడనే కాకుండా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా మాడ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ అని ఆయన స్పందించారు.

విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం దర్శకుడు పూరి తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఫైటర్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే ఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా విడుదల కానుండగా..గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus