Pavitra: పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ఈరోజు విడుదల కాబోతుంది. ఆల్రెడీ చాలా చోట్ల షోలు పడ్డాయి. సూపర్ హిట్ టాక్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఛార్మి, పూరి, కరణ్ జోహార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాండమిక్ రావడంతో 3 ఏళ్ళుగా పూరి ఈ చిత్రంతోనే ఉండిపోయాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీతో మైక్ టైసన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

టీజర్, ట్రైలర్, పాటలు.. అన్ని సినిమా పై అంచనాలు పెంచాయి. ఇదిలా ఉండగా.. పూరి జగన్నాథ్ గురించి తాజాగా అతని కూతురు పవిత్ర పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. “మై ఫరెవర్. నా లైఫ్ లో నేను ఇంత నెర్వస్ గా ఎప్పుడూ లేను. నేను మీ బిగ్ డే. నువ్వు చాలా కష్టపడ్డావు, నీ కష్టానికి రేపు ఫలితం దక్కుతుంది. ఇది నీ లైఫ్ లో చాలా పెద్ద సినిమా.

కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో నాన్న.. ‘నిన్ను చూసి మేము చాలా గర్వపడుతుంటాము. అలాగే నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటాము. కొత్త అవకాశాలు అందుకోవడానికి జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదనే విషయంలో నిన్నే స్ఫూర్తిగా తీసుకున్నాను. నీ టీం ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.

అందరికీ ఆల్ ది బెస్ట్. నువ్వు నా రాక్.. అలాగే వీక్ నెస్ కూడా నాన్న.రేపు ఫిజికల్ గా నేను నీ దగ్గర లేకపోయినా.. నా ఆనందం విజిల్స్ నిన్ను చేరుకుంటాయి. మూవీ మొత్తం నేను చీర్ చేస్తాను. నిన్ను హోల్డ్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నాను పింకీ. వుయ్ లవ్ యు సో మచ్” అంటూ రాసుకొచ్చింది పవిత్ర.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus