Puri Jagannadh, Chiranjeevi: లీక్‌ చేసి రచ్చ రచ్చ చేసిన విజయ్‌ దేవరకొండ!

అందరి సినిమాలకు సంబంధించి చిరంజీవి లీక్‌ చేసేస్తుంటారు అని చిరంజీవికి పేరు. ఈ క్రమంలో తన సినిమా గురించి కూడా లీక్‌ ఇచ్చేస్తుంటారు. అలాంటి చిరంజీవి సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని లీక్‌ చేసి షాక్‌ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌తో విజయ్‌ దేవరకొండ చేస్తున్న ‘జేజీఎం’ సినిమా అనౌన్స్మెంట్‌ వేదికగా ఈ లీక్‌ ఇచ్చాడు విజయ్‌. అదే ‘చిరంజీవి సినిమాలో పూరి జగన్నాథ్‌’. అవును మీరు చదివింది నిజమే. ఈ కాంబో కుదిరిందట. అయితే నటులుగా మాత్రమే.

Click Here To Watch NOW

పూరి జగన్నాథ్‌ ఫ్రేమ్‌లో చిరంజీవిని చూడాలనే కోరిక లేని అభిమాని ఉండరు అంటారు. పూరి మాస్ ఫ్రేమ్‌లో చిరును చూసి మురిసిపోవాలని ప్రతి చిరు అభిమాని కోరుకుంటారు. కానీ అప్పుడెప్పుడో అవుతుంది అనుకున్న ఈ సినిమా కుదరలేదు. ఆ తర్వాత చిరంజీవి వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయారు. మరోవైపు పూరి కూడా అంతే. ఈ నేపథ్యంలో ఇంత త్వరగా పూరి, చిరు సినిమా చూడమా అనుకుంటుండగా… చల్లటి వార్త చెప్పాడు విజయ్‌. పూరిని దర్శకుడిగా, చిరును హీరోగా కాదు కానీ, ఇద్దరినీ నటులుగా చూస్తామట.

త్వరలో చిరంజీవి – పూరి జగన్నాథ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు అని చెప్పాడు విజయ్‌. అయితే అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి మూడు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దానిలో ఇద్దరూ కలసి కనిపించొచ్చు. చిరంజీవి సినిమాల సంగతి చూస్తే బాబీ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ (వర్కింగ్‌ టైటిల్‌).. మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంక‌ర్‌’, మోహన్‌రాజా ‘గాడ్ ఫాద‌ర్’ సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో ఎందులో పూరి కనిపిస్తారనేది ఆసక్తికరం.

సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం అయితే బాబీ సినిమాలోనే చిరంజీవి పక్కన పూరిని చూడొచ్చు అని తెలుస్తోంది. మిగిలిన రెండు సినిమాల్లో పూరి కనిపించే స్థాయి పాత్రలు ఇంకా వేరే ఏవీ లేవు అని అంటున్నారు. అయితే ఇదంతా ఊహ మాత్రమే… చిరంజీవి తలచుకుంటే ఏ సినిమాలో అయినా పూరికి ఓ పాత్ర రాయించొచ్చు. గతంలో చాలా సినిమాల్లో ఇలా పాత్రలు రాయించి, సినిమాలో పెట్టించిన అనుభవాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus