Puri Jagannadh: హీరో పాత్రకు నత్తి అందుకే డైలాగ్స్ తగ్గించాం!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదటిసారిగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇకపోతే ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ అనన్య పాండే పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే మరోవైపు పూరి జగన్నాథ్ చార్మి కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయనకు ఈ సినిమా ట్రైలర్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సినిమాకి ఇదొక ట్రైలరే ఉంటుందా ఇంకో ట్రైలర్ కూడా ఉండబోతుందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ చాలామంది ఈ ట్రైలర్ ద్వారా సినిమా అర్థం కాలేదని చెబుతున్నారు. అయితే తాను రెండు మూడు ట్రైలర్స్ కట్ చేశానని, ఇది మాత్రమే నచ్చడంతో ఈ ట్రైలర్ విడుదల చేశామని తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో హీరో పాత్రకు నత్తి ఉండటం వల్ల ట్రైలర్ లో ఎక్కువ డైలాగ్స్ పెట్టలేదని ఈయన పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…కరీంనగర్ కి చెందిన ఓ కుర్రాడు తన తల్లితో కలిసి ముంబై వెళ్లి చాయ్ అమ్ముతూ బతుకుతారు. అయితే తన కొడుకు నేషనల్ ఛాంపియన్ కావాలని తన తల్లి కోరికను ఆ కుర్రాడు ఎలా తీర్చారు అనేదే ఈ సినిమా కథ అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా కీలకంగా ఉండబోతుందని ఈ సన్నివేశమే సినిమాకి హైలెట్ అవుతుందని ఈ సందర్భంగా ఈయన సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus