పాపం కొడుకుని హీరోగా పెట్టి మంచి హిట్ కొట్టి అబ్బాయిని సక్సెస్ ఫుల్ మాస్ హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడంతోపాటు తాను కూడా గెట్ బ్యాక్ అవుదామనుకొన్న పూరీ ఆశల్ని “మెహబూబా” చిత్రం అణగార్చిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాధ్ సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాధ్ కి మరో హీరో ఎవరూ అవకాశం ఇవ్వలేదు. నాగార్జున, నానిల పేర్లు వినిపించినప్పటికీ.. ఒక హిట్ లేదా కనీసం యావరేజ్ కొడితే తప్ప వాళ్ళతో సినిమా తీసే అవకాశం పూరీ సొంతం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఈలోపు తన కుమారుడ్ని హీరోగా పెట్టి ఇంకో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు పూరీ జగన్నాధ్.
ఈమేరకు ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయ్యిందట. ఈసారి ప్రేమకథ కాకుండా పూరీ మార్క్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట పూరీ. మరి ఈ సినిమాతోనైనా కొడుక్కి హిట్ ఇచ్చి తన ఉనికిని చాటుకుంటాడో లేదో చూడాలి. అయితే. ఈ చిత్రాన్ని పూరీ మళ్ళీ స్వయంగా నిర్మిస్తాడా లేక బయట నిర్మాతలు ఎవరైనా మొగ్గు చూపుతారా అనేది తెలియాల్సి ఉంది.