డాషింగ్ డైరెక్టర్.. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తో (iSmart Shankar) ఒక బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చుకుని మరీ ఫామ్లోకి వచ్చినట్టు ప్రూవ్ చేసుకున్న ఆయన.. అటు తర్వాత ‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి డిజాస్టర్లు ఇచ్చి మళ్ళీ పెవిలియన్ బాట పట్టారు. దీంతో పూరికి ‘అర్జెంటుగా ఒక హిట్టు కావాలి’.. అనేకంటే ముందు ‘పూరికి అర్జెంటుగా ఒక హీరో కావాలి’ అనే పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే ‘లైగర్’ తర్వాత పూరీ దర్శకత్వంలోనే ‘JGM'(జన గణ మన) అనే సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రెడీ అయ్యాడు. కానీ ‘లైగర్’ డిజాస్టర్ అవ్వడంతో అతను వెనకడుగు వేశాడు. ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా డిజాస్టర్ అవ్వడంతో.. పూరీ కథ చెబుతామని చెప్పినా ఒప్పుకునే హీరోలు కరువయ్యారు. ఓ దశలో నాగార్జున (Nagarjuna), గోపీచంద్ (Gopichand) ..లు అవకాశాలు ఇచ్చే విధంగా కనిపించినా, తర్వాత వాళ్ళు కూడా చేతులెత్తేశారు.
అయితే ప్లాపుల్లో ఉన్నాడని పూరీని తక్కువ చేసి చూడటానికి ఏమీ లేదు. గతంలో కూడా ప్లాపుల్లో ఉన్నప్పుడు పూరీ సాలిడ్ హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే నిర్మాతలు పూరితో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఫైనల్ గా పూరీ జగన్నాథ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక హీరోని పెట్టాడు.
అతను మరెవరో కాదు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ‘మహారాజ’ (Maharaja) తో విజయ్ సేతుపతి ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అది రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు హీరోగానే కంటిన్యూ అవ్వాలని విజయ్ సేతుపతి భావిస్తున్నాడు. ఈ క్రమంలో పూరీ వినిపించిన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.