స్టార్ డైరెక్టర్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారట!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి పూరి ఏ సినిమా మొదలుపెట్టినా.. నాలుగైదు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. కానీ కరోనా కారణంగా విజయ్ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు షూటింగ్ లు చేసుకోవడానికి పర్మిషన్లు రావడంతో దర్శకనిర్మాతలందరూ కూడా తమ సినిమాల పనులు మొదలుపెట్టేశారు. కానీ పూరి మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

దానికి కారణం కరణ్ జోహార్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి పూరి ప్రొడ్యూసర్ అయితే ఈపాటికే సినిమా షూటింగ్ పునః ప్రారంభించేవాడు. కానీ ఈ సినిమాకి ఫండింగ్ కరణ్ జోహార్ ఇస్తున్నాడు. ప్రస్తుతం కరణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. దీంతో ప్రయారిటీ బేసిస్ మీద సినిమాలు పూర్తి చేస్తున్నాడు. పూరి సినిమా కోసం ఇంకా చాలా భాగం షూట్ చేయాల్సివుంది అందుకే ఇప్పుడే షూటింగ్ మొదలుపెట్టాల్సిన పనిలేదని అలా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశాడట. దీంతో పూరి జగన్నాధ్ మరో సినిమా మొదలుపెట్టుకోలేక విజయ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.

బాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాలీవుడ్ తారలు షూటింగ్ లో పాల్గొనే రిస్క్ చేయడం లేదు. పూర్తయ్యే దశలో ఉన్న సినిమాలను మాత్రం ఏదొక విధంగా కంప్లీట్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు పూరి తన సినిమాను పూర్తి చేసి ఉంటే గనుక కరణ్ ఓటీటీకి ఇచ్చేసేవాడు. ఆ విధంగా పూరి సేవ్ అయ్యాడనుకోవాలి. తరువాత మెల్లగా సినిమాని పూర్తి చేసి థియేటర్లో రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus