పూరి ఫ్యాన్స్ క్రియేటివిటీ..క్రికెటర్ ని భాయ్ ని చేశేశారు?
- May 18, 2020 / 06:29 PM ISTByFilmy Focus
ఇంటర్నేషనల్ క్రికెటర్ మరియు స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య వరుస వీడియోలు చేస్తూ నెటిజన్స్ ని ఫిధా చేస్తున్నారు. బన్నీ లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో మూవీలోని బుట్ట బొమ్మా మరియు రాములో రాములా పాటలకి భార్యతో కలిసి టిక్ టాక్ చేసిన డేవిడ్ వార్నర్,ఆ మధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ పోకిరి లోని ఫేమస్ డైలాగ్‌కి కూడా టిక్ టాక్ వీడియో చేయగా, దానికి స్పదించిన పూరీ..
తన సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయాలని కోరాడు. ఇందుకు వార్నర్.. సన్ రైజర్స్ వాళ్లు ఒప్పుకుంటే తప్పకుండా నటిస్తా అన్నాడు.పూరీ, వార్నర్ కి ఓ ఆఫర్ ఇచ్చాడో లేదో నెటిజన్స్ మరియు ఔస్తాహికులు తమ బుద్ధికి పనిచెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే ఇలా ఉంటుంది అన్నట్లు అనేక పోస్టర్స్ చేసి చూపించారు. వార్నర్‌ని ఇస్మార్ట్ శంకర్ రూపంలోకి మార్చి డేవిడ్ భాయ్ పేరుతో ఒక పోస్టర్ రెడీ చేశారు.

అన్నింటిలో వార్నర్‌పై తుపాకులు ఎక్కు పెట్టి ఉండగా, వార్నర్ నడిచి వస్తున్నట్లున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నిజంగా పూరి దర్శకత్వంలో డేవిడ్ మూవీ సాకారం అయితే ఆయన్ని డాన్ గానో, ఫారీన్ రౌడీగానో చూపించడం ఖాయం. సెన్సేషన్ కోసం ఎలాంటి ప్రయోగాలకైనా వెరవని పూరి ఏదైనా చెయ్యొచ్చు. ఇక ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ హీరోగా ఓ ఫైటింగ్ బేస్డ్ మూవీ తీస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా పలు బాషలలో విడుదల కానుంది.
Most Recommended Video
View this post on Instagram
#DavidWarner 👌👌 #Baahubali #Prabhas
A post shared by Filmy Focus (@filmyfocus) on
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు













