Puri Jagannadh, Chiranjeevi: ‘గాడ్ ఫాదర్‌’ తో పూరి జగన్నాథ్.. ఆ కల ఇలా నెరవేరిందట..!

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది పూరి జగన్నాథ్ కల. ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అయిన 150వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు గతంలో చరణ్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం వి.వి.వినాయక్ కు దక్కింది. తర్వాత చిరు చాలా ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. చిరుని కలిసి ఎన్నో సార్లు కథలు వినిపించారు పూరి. అందులో కొన్ని చిరుకి నచ్చాయి కూడా.

కానీ వీరి కలయికలో ప్రాజెక్టు మాత్రం సెట్ అవ్వడం లేదు.ఆఖరికి పూరి శిష్యుడు మెహర్ రమేష్ కు కూడా చిరు అవకాశం ఇచ్చారు. అలాగే వెంకీ కుడుముల, బాబీ వంటి కుర్ర డైరెక్టర్లతో చిరు సినిమాలు సెట్ చేసుకున్నారు. అయితే దర్శకుడిగా కాకపోయినా..పూరికి చిరుతో నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.

నయనతార, సత్యదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా… బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చిన్న అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి మరో ఆకర్షణగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా జాయిన్ అయ్యాడు.గత రెండు మూడు రోజులు పూరి ‘గాడ్ ఫాదర్’ లో భాగం కానున్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.వాటిని నిజం చేస్తూ ఈరోజు చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.

పూరి జగన్నాథ్‌ ‘గాడ్ ఫాదర్’ సెట్స్ కు వెళ్లి చిరుని కలిసాడు. పూరితో పాటు ఛార్మి కూడా వెళ్ళింది. ఈ విషయం పై చిరు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాలని నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా!

అందుకే, నా పూరి జగన్నాథ్‌ను ఓ ప్రత్యేక పాత్రలో పరిచయం చేస్తున్నాను” అంటూ చిరు చెప్పుకొచ్చారు. గతంలో పూరి తన సినిమాల్లో కామియోలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ‘ఏ మాయ చేసావె’ సినిమాలో కూడా పూరి నటించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus