Puri Jagannadh, Mike Tyson: మైక్ టైసన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సినీ కెరియర్లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అనన్య జంటగా లైగర్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.ఈ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్ర బృందం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హన్మకొండలో ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ తాను విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా చూడలేదని అయితే మా ఆవిడ తిట్టిన తర్వాత ఆ సినిమా చూశానని తెలిపారు. సినిమా చూసిన 45 నిమిషాలకే ఆఫ్ చేశానని, ఆ సమయంలో నా దృష్టి మొత్తం అతను నటన వైపు వెళ్ళిందనీ తెలిపారు. ఈ సినిమాలో విజయ్ నటిన చూసి ఏ హీరో అయినా ఇంత నిజాయితీగా ఉంటారా అనిపించింది.

ఆ క్షణమే ఎప్పటికైనా విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నానని ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ వెల్లడించారు. విజయ్ ఎంతో నిజాయితీగా ఉంటారనీ, ఆయన కోపంలో కూడా నిజాయితీ ఉంటుందని ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ గురించి పెద్ద ఎత్తున ప్రశంశాలు కురిపించారు. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్ర అద్భుతంగా ఉంటుందని ఆయన కోసం అమెరికాలో పెద్ద సెట్ చేసి అతని కోసం ఎదురు చూస్తు వస్తారా.. రారా అనుకుంటున్న సమయంలో ఆయన ఎంట్రీ ఇవ్వడంతో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు.

మైక్ టైసన్ వంటి లెజెండ్ తో పనిచేసే అవకాశం తనకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక మైక్ టైసన్ గురించి ఈయన మాట్లాడుతూ నేను విజయ్ ఆయన పక్కన కూర్చుంటే జంతువు పక్కన కూర్చున్న ఫీలింగ్ వచ్చేదని, ఆయన ఒక గుర్రం ఏనుగులా కనిపిస్తారు. అంత లావుగా ఉంటారు. అలాంటి వ్యక్తితో పనిచేయడం నిజంగా అదృష్టం అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus