Puri Jagannadh: పూరి కొత్త తెలుగు సినిమా ఇంత త్వరగా ఉండదట

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. అలా ఇంటా, రచ్చ గెలిచి ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు పూరి జగన్నాథ్‌. ‘బుడ్డా హోగా తేరా బాప్‌’ సినిమాతో ఇప్పటికే బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్నాడు పూరి. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్‌ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం సెట్స్‌ మీదున్న ‘లైగర్‌’ తర్వాత పూరి ఏ సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు. దీనికి కొందరు యశ్‌ సినిమా అని అంటుండగా, కాదు నితిన్ సినిమా అని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇవేవీ కావని లేటెస్ట్‌ బజ్‌.

‘లైగర్‌’ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు కానీ.. అదయ్యాక పూరి బాలీవుడ్‌లో సినిమానే చేస్తాడని కొత్త టాక్. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు, అగ్రిమెంట్‌ సంతకాలు కూడా అయిపోయాయట. అయితే హీరో ఎవరు, నిర్మాతలు ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. ఇప్పటికప్పుడు పూరి బాలీవుడ్‌లో సినిమా చేస్తాను అంటూ ఓకే చెప్పే హీరోలు చాలామందే ఉంటారు. అయితే పూరి యంగ్‌ హీరోతో చేస్తాడా, లేక సీనియర్‌ హీరోతో చేస్తాడా అనేది తెలియడం లేదు.

మొన్నీ మధ్య మనం అనుకున్నట్లు ‘లైగర్‌’ విషయంలో పూరి చాలా స్లోగా వెళ్తున్నాడు. మరోవైపు కరోనా పరిస్థితి మళ్లీ తిరగబెట్టడంతో ఇంకా ఆలస్యమవుతోంది. ఇదయ్యాక బాలీవుడ్ సినిమా చేసి టాలీవుడ్‌కి రావాలి. దీనికి కనీసం ఏడాది అయినా పడుతుంది. కాబట్టి ఇంత త్వరగా పూరి నుండి స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఆశించడం కష్టమే.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus