పూరి జగన్నాథ్.. ఫాస్ట్ గా సినిమాలు తీయడంలో దిట్ట. బడ్జెట్ కూడా శృతి మించేలా చేయడు అనే మంచి పేరు కూడా ఈయనకి ఉంది. ‘బిజినెస్ మెన్’ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చేశాడు. ‘టెంపర్’ కూడా రూ.50 కోట్ల బడ్జెట్ లో అయిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా రూ.40 – రూ.50 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ అయిన సినిమానే. అలా అని పూరి జగన్నాథ్ సినిమాలో చీప్ ప్రొడక్షన్ వాల్యూస్ ఏమీ కనిపించవు.
బాలీవుడ్ సినిమాల రేంజ్లోనే విజువల్స్ ఉంటాయి. అందుకే పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి బడా నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ కి కూడా పాన్ ఇండియా ఇమేజ్ పై వ్యామోహం పెరిగినట్టు ఉంది.ఎందుకంటే.. ‘లైగర్’ సినిమాకు దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. రూ.100 కోట్ల బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమా తీయడం కూడా గొప్ప విషయమే.కానీ కేవలం మార్కెట్ పైనే దృష్టి పెట్టి ..
స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది అసలు ఇబ్బంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. పూరి ప్రస్తుతం రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందిస్తున్నాడు. దీనికి ‘ఇస్మార్ట్ శంకర్’ కి డబుల్ బడ్జెట్ అవుతుందని టాక్. ఇటీవల క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించారట. ఆ ఒక్క ఫైట్ కే రూ.7 .5 కోట్లు ఖర్చు అయ్యిందని టాక్.
దాని కోసం సెపరేట్ గా సెట్ వేయడం కూడా జరిగిందట. హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి.. ఆ మాత్రం పెట్టొచ్చు అన్నట్టు పూరి అండ్ టీం చెబుతుందని టాక్. అయితే (Puri Jagannadh) పూరి కెరీర్లోనే ఇది కాస్ట్లీ ఫైట్ అనాలి. మరి సినిమాలో ఈ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!