పూరి జగన్నాథ్ సినిమాల్లో విలన్ చాలా మాసీగా ఉంటాడు. మాటలు, చేతలు కూడా అంతే. పాత్ర ఎలాంటిదైనా అందులో పూరియిజం కచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇంకా జాగ్రత్తగా చూస్తే పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే మహిళల పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అప్పటివరకు ఆ నటికి అలాంటి పాత్ర పడి ఉండదు. ఒకవేళ చేసినా.. ఈ రేంజి నటన చూసి ఉండరు. అలా పూరి నుండి వచ్చిన తల్లి పాత్రల గురించి చూద్దాం.
* ‘లైగర్’లో రమ్యకృష్ణ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ’ అంటూ.. రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌లో పవర్ కనిపిస్తోంది. ఆమె లుక్, డిక్షన్, స్టయిల్‌లో ఫుల్ మాస్ కనిపిస్తోంది.
* ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ సినిమా చూశారా? అందులో గుండక్క అనే పాత్రలో శ్రుతి ఎలా అదరగొట్టిందో మీకు తెలిసే ఉంటుంది. క్రూరమైన రాజకీయ నాయకురాలిగా శ్రుతి వావ్ అనిపించింది. గుండక్క కామెడీ, విలనిజం రెండూ అదిరిపోతాయి.
* కథానాయికగా రోజా చేసిన సినిమాల్లో ఆమె పాత్రలు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ ‘గోలీమార్’లో అరుంధతిగా ఆమె నటన మాత్రం అద్భుతం అని చెప్పాలి. హీరోయిన్ తల్లిగా రోజా అభినయం అదుర్స్ అంతే. హీరోకు వార్నింగ్ ఇచ్చే సీన్స్ రిపీట్‌లో చూసేవాళ్లూ ఉన్నారు.
* ‘లోఫర్’ సినిమా తల్లీ బిడ్డల కథ అనే విషయం తెలిసిందే. అందులో వరుణ్‌తేజ్ తల్లి లక్ష్మమ్మగా రేవతి నటించారు. ఆ సినిమాలో రేవతి నటన, యాటిట్యూడ్ అదిరిపోతాయి.
* ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో జయసుధ పాత్రే తీసుకొండి. భర్తకు దూరమై, కొడుకుతో ఉండే పాత్ర అది. టీచర్‌గా పని చేసే జయసుధతో రవితేజ సీన్స్ అదిరిపోతాయి. సింగిల్ పేరెంట్ ఎలా ఉండాలో పక్కాగా చూపించే పాత్ర అది.
* లేడీ కమెడియన్స్‌లో కోవై సరళకు డిఫరెంట్ ప్లేస్ ఉంది. ఆ డిక్షన్, నటన ఆమెకు మాత్రం సొంతం అనేలా ఉంటాయి. ‘దేశముదురు’ శివానీగా కోవై సరళ నటన మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. సాధారణ జీవితాన్ని వదిలి సన్యాసం తీసుకున్న ఆ పాత్ర అదుర్స్ అంతే.