ఓ స్టార్ హీరో, మరో కుర్ర దర్శకుణ్ని ఓ పాన్ డబ్బా దగ్గరకు తీసుకెళ్లి పాన్ కొనుక్కొని తిన్నారు అంటే నమ్మగలరా? ఛ.. ఇలాంటివి జరగడం అసాధ్యం. అంత ఈజీ కాదు అంటారా? కానీ ఇది జరిగింది అయితే ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం. ఆ హీరో చిరంజీవి అయితే, ఆ దర్శకుడు పూరి జగన్నాథ్. అవును ఈ విషయాన్ని చెప్పింది పూరి జగన్నాథే. చిరంజీవి జన్మదినం సంద్భంగా పూరి జగన్నాథ్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
పదిహేనేళ్ల క్రితం ఓ రోజు.. పూరి జగన్నాథ్‌ను చిరంజీవి కారులో ఎక్కించుకుని అలా బయటికి తీసుకెళ్లారట. ‘ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్యా?’ అని పూరి అడిగితే.. ఊరికే సరదాగా అలా వెళ్లొద్దాం అన్నారు తప్ప కారణం చెప్పలేదట. అలా అలా మాదాపూర్ పరిసరాలు దాటుకుంటూ.. జనాలు పెద్దగా లేని ఓ ప్రాంతంలో ఉన్న చిన్న పాన్ డబ్బా దగ్గర కారు ఆపారట చిరంజీవి. ఆ దుకాణంలో కిళ్లీలు కట్టే వ్యక్తి తప్ప.. ఆ చుట్టు పక్కల ఎవరూ లేరట. ఆ షాపులో ఉన్న వ్యక్తి చిరంజీవి పిలిచి.. పాన్ కట్టమని అడిగారట.
దీంతో ఆ షాపులో ఉన్న వ్యక్తి షాక్ అయ్యాడట. చిరంజీవి తన బడ్డీ కొట్టుకు వచ్చి, పాన్ కట్టమని అడగడమా అనుకుంటూ లోపలకి వెళ్లి పాన్ కట్టడం ప్రారంభించాడట. ఆ విషయం గురించి ఎవరికైనా చెప్పాలనే ఆతృతతో మెగాస్టార్ మెగాస్టార్ అని పదే పదే అరుస్తున్నాడట. కానీ ఆయన మాటలు వినిపించేంత దగ్గరలో ఎవరూ లేరట. కాసేపటికి పాన్ కట్టడం పూర్తయిందట. ఆ వెంటనే చిరంజీవి అతనికి డబ్బులు ఇచ్చి కారు స్టార్ట్ చేశారట.
అయితే ఆ బడ్డీ కొట్టు వ్యక్తి కళ్లలో కనిపించిన ఎగ్జైట్‌మెంట్ అలా తన మనసులో ముద్రించుకుపోయింది అని పూరి చెప్పారు. పూరి జగన్నాథ్ చెప్పిన ప్రకారం చూసుకుంటే.. ఇది ‘చిరుత’ సినిమా చేస్తున్న సమయంలోనే, లేక ఆ ముందో జరిగి ఉండాలి. ఎందుకంటే రామ్‌చరణ్ పరిచయ చిత్రం ‘చిరుత’ 2007లో విడుదలైన విషయం తెలిసిందే. అన్నట్లు ఈ నెల 28కి ‘చిరుత’ వచ్చి 15 ఏళ్లు పూర్తవుతోంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?