Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » పూరి జగన్నాథ్ గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్!

పూరి జగన్నాథ్ గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్!

  • September 24, 2016 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ్ గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్!

క్విక్ అన్నమాటకు మరో పేరు పూరి జగన్నాథ్. ఐడియా వచ్చిందే తడువుగా స్క్రిప్ట్ రెడీ కావడం, సెట్స్ మీదకు వెళ్లిపోవడం, ఫస్ట్ కాపీ సిద్ధం కావడం… చాలా వేగంగా జరిగిపోతాయి. హీరో ఎవరైనా అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేయడం జగన్ స్పెషల్. అందుకే పరిశ్రమలోకి వచ్చిన 16 ఏళ్లలో కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్ భాషల్లో ఇప్పటి వారికి 37 సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా “ఇజం” మూవీని డైరక్ట్ చేస్తున్నారు. ఈ స్పీడ్ డైరక్టర్ నేడు (సెప్టెంబర్ 28) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పూరి కి ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలుపుతూ… ఆయన రీల్ అండ్ రియల్ లైఫ్ సీక్రెట్స్ గురించి కథనం.

1. జన్మస్థలం కొత్తపల్లిPuri Jagannathవిశాఖ పట్నం జిల్లాలోని బాపిరాజు కొత్తపల్లిలో 1966 సెప్టెంబర్ 28 న పూరి జగన్నాథ్ జన్మించారు. తల్లి దండ్రులు సత్యవతి, సింహాచలం. జగన్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉమా శంకర్, సాయి రామ్ శంకర్.

2. పుస్తకాల పురుగుPuri Jagannathమహాకవి శ్రీ శ్రీ, చలం, గోపి చంద్, శరత్, ముళ్లపూడి వెంకట రమణ, భానుమతి, విశ్వనాథ సత్యనారాయణ రచనలే కాకుండా రామాయణం, భారతం, భాగవతాలను జగన్నాథ్ చిన్నప్పుడే చదివేసారు. ఇప్పుడు ఇతర భాషల్లో ప్రాచుర్యం పొందిన పుస్తకాలను చదువుతుంటారు. అప్పుడైనా ఇప్పుడైనా రీడింగ్ ని ఆపలేదు.

3. సినిమా టు టీవీ టు సినిమాPuri Jagannathపూరి మనీ మనీ, గులాబీ, నిన్నే పెళ్లాడుతా సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన తర్వాత డైరక్టర్ గా దూరదర్శన్ లో వంద ఎపిసోడ్లకు పైగా తీశారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలెట్టారు.

4. తప్పని సినీ కష్టాలుPuri Jagannathపోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి దర్శకుడిగా బ్రేక్ కోసం చాలా రోజులు ఎదురు చూసారు. మొదట్లో
సుమన్ హీరో గా “పాండు” సినిమా అవకాశం వచ్చింది కానీ అది ఆగిపోయింది. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా “థిల్లానా” చిత్రం డైరక్ట్ చేసే ఛాన్స్ అవచ్చింది. ఒక పాట కూడా రికార్డింగ్ జరిగింది అయినా సెట్స్ మీదకు వెళ్లలేదు. తొలి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసి సూపర్ సక్సస్ అయ్యారు.

5. ప్రేమ కథల స్పెషలిస్ట్Puri Jagannathసినిమాల్లో ప్రేమకథలను అందంగా చూపించే పూరి.. కాలేజీ రోజుల్లో ప్రేమ కథలు ఎక్కువగా రాసేవారు. అయన రాసిన మొదటి లవ్ స్టోరీ పేరు “తొలి చినుకు”. అలాంటివి అప్పుడే 25 ప్రేమ కథలు రాశారు.

6. ఇడియట్ పూరిPuri Jagannathఇడియట్ లోని లవ్ స్టోరీ పూరి సొంత లైఫ్ లోంచి పుట్టుకొచ్చింది. లావణ్య(భార్య)ను జగన్ చూసిన వెంటనే ప్రేమించారు. ఆ విషయాన్నీ వెంటనే ఆమెకు చెప్పడమే కాదు.. అంతే స్పీడ్ గా తన మాటలతో లావణ్య హృదయాన్ని గెలుచుకున్నారు. సనత్ నగర్ లోని వెంకటేశ్వర గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. వారికి ఆకాష్, పవిత్ర అని ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరూ బుజ్జిగాడు చిత్రంలో నటించారు.

7. గొప్ప పెయింటర్Puri Jagannathమెగా ఫోన్ తో హిట్లు ఇచ్చే జగన్ కుంచె పట్టుకుని ఎన్నో అపురూప చిత్రాలు గీశారు. స్కూల్ డేస్ లో డ్రాయింగ్ కాంపిటేషన్ లో పూరి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.

8. హిట్ యాడ్ మేకర్Puri Jagannathపూరి వాణిజ్య ప్రకటనలు చేశారంటే ఆ కంపెనీ బిజినెస్ పెరగాల్సిందే. అతని దర్శకత్వంలో వచ్చిన గోదావరి డీఏపీ యాడ్ రైతులందరికీ బాగా గుర్తిండి పోయింది. అలాగే ఎల్ ఎం ఎల్ వెస్పా స్కూటర్ యాడ్ కూడా పూరి తీసిన ప్రకటనల్లో మంచి పేరు తెచ్చి పెట్టింది.

9. బిగ్ బి తో సినిమాPuri Jagannathబాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీయడం అందరి కల. ఆ కలని నిజం చేసుకున్నారు జగన్. ఆయనతో “బుడ్డా హోగా తేరా బాప్” అనే సినిమా తీసి హిట్ అందుకున్నారు. లాభాల్లో షేర్ ని కూడా సొంతం చేసుకున్నారు.

10. తెరపైన జగన్Puri Jagannathతెర వెనుక నుండి నడిపించడమే కాదు.. జగన్ అప్పుడప్పుడు తెర పైన కూడా కనిపించారు. శివ (హిందీ), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఏ మాయ చేసావే, టెంపర్ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannath
  • #Puri Jagannath Director
  • #Puri Jagannath Family
  • #Puri Jagannath Habies
  • #Puri Jagannath Life Secrets

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని ఆకట్టుకునే డైలాగులు ఇవే

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలోని ఆకట్టుకునే డైలాగులు ఇవే

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

17 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

17 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

18 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

19 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

20 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

10 mins ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

21 mins ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

34 mins ago
David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

41 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version