మాటల తూటాలు పేల్చడానికి సిద్ధమవుతున్న బాలయ్య
- July 10, 2017 / 09:30 AM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే ముందుగా యాక్షన్ గుర్తుకొస్తుంది… వెంటనే ఆయన డైలాగులు. బాలయ్య నోటి నుంచి సాధారణ డైలాగ్ సైతం పవర్ ఫుల్ గా వస్తుంది. పూరి జగన్నాథ్ పంచ్ డైలాగులు రాయడంలో దిట్ట. వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ పైసా వసూల్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొన్ని రోజుల క్రితం పోర్చుగల్ ల్లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా నగరంలో మరో షెడ్యూల్ ని మొదలు పెట్టింది. ఈ షూటింగ్ స్పాట్ లో పూరి, బాలయ్య కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.
బాలకృష్ణ షాట్ కి వెళ్తూ డైలాగ్ ని ఒక సారి చూసుకుంటున్నట్లుగా ఉంది ఆ చిత్రం. పైసా వసూల్ ల్లో బాలకృష్ణను డైరక్టర్ కొత్తగా చూపిస్తున్నారు. అలాగే ఆయనకోసం సరికొత్త డైలాగ్స్ రాసి ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాలో శ్రియ, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ కానున్న పైసా వసూల్ పై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















