Purushothamudu Collections: ‘పురుషోత్తముడు’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ‘పురుషోత్తముడు’ అనే సినిమా రూపొందింది.రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్స్ …పర్వాలేదు అనిపించాయి. మరోపక్క లావణ్యతో వివాదం వల్ల రాజ్ తరుణ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న తరుణంలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి ‘పురుషోత్తముడు’ పై ప్రేక్షకుల దృష్టి పడింది.

మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.రెండో రోజు కూడా పికప్ అయ్యింది అంటూ ఏమీ లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.13 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర 0.08 cr
ఈస్ట్+వెస్ట్ 0.06 cr
కృష్ణా+గుంటూరు 0.08 cr
నెల్లూరు 0.03 cr
ఏపి+తెలంగాణ 0.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.48 cr

‘పురుషోత్తముడు’ సినిమా చాలా వరకు రెంటల్ పద్ధతిలోనే రిలీజ్ చేశారు. వాటి వాల్యూ రూ.1.22 కోట్లుగా ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.1.8 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కేవలం రూ.0.48 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.32 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus