Pushpa 2: పుష్ప 2: కలెక్షన్లపై అనుమానాలు.. ఎంత పెంచారు?

ప్రస్తుతం సినీ ప్రియులు ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) హవా గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. బాహుబలి 2 (Baahubali 2) , ఆర్ఆర్ఆర్  (RRR)  తరువాత తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు రావడం చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. రిలీజ్ తర్వాత తొలి వారంలోనే పుష్ప 2 రూ.1002 కోట్ల వసూళ్లు సాధించిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Pushpa 2

ఇది ఇండియన్ సినిమాల రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన పుష్ప 2, మాస్ సీక్వెన్స్‌లు, పాటలు, అల్లు అర్జున్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే ఇదే సమయంలో సినిమా కలెక్షన్లపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు మేకర్స్ చెప్పిన వసూళ్ల సంఖ్య పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మేకర్స్ రూ.1002 కోట్లను ప్రకటించినప్పటికీ, నిజమైన గణాంకాలు కాస్త తక్కువగా ఉండవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. వాస్తవానికి, 6 రోజుల్లో పుష్ప 2 రూ.950 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం గురించి కొందరు లెక్కలు సరిగా కుదరడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. మేకర్స్ దాదాపు 100 కోట్ల వరకు ఎక్కువ స్థాయిలో ఫేక్ నెంబర్లు పెంచారు అని ఓ వర్గం నుంచి వస్తోన్న టాక్. ఇక ఈ అనుమానాలకు ప్రధాన కారణం, దేశీయ మార్కెట్‌లో మొదటి వారం చివర్లో కొన్ని ప్రాంతాల్లో టికెట్‌ అమ్మకాలు తగ్గినట్లు చెప్పబడింది.

ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో వీకెండ్ ముగిసిన తర్వాత సినిమా వసూళ్లు కొంచెం తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇక, మేకర్స్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన వసూళ్ల కారణంగా మొత్తం మొత్తం రూ.1002 కోట్లుగా ప్రకటించారని అర్థమవుతోంది. వివాదాల పక్కనపెడితే, పుష్ప 2 కలెక్షన్లు పట్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గడం లేదు. సినిమా సాధించిన ఘనతలను లెక్కించడంలో అతి చేసినా, అల్లు అర్జున్, సుకుమార్ జోడీ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారనే విషయం స్పష్టమవుతోంది.

పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus