అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన “పుష్ప 2: ది రూల్” (Pushpa 2 The Rule) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపించింది. హిందీ మార్కెట్‌లో ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చకు కారణమైంది. హిందీ డబ్ వెర్షన్ ద్వారా 4 కోట్లకు పైగా ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేస్తూ, పోస్ట్ పాండమిక్ టాప్ 5 హిందీ సినిమాల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇది అల్లు అర్జున్ హిందీ బాక్సాఫీస్‌పై పట్టు సాదించడనే చెప్పాలి.
“గదర్ 2” హిందీ మార్కెట్‌ను షేక్ చేసిన తర్వాత 3.4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో ముందంజలో ఉండగా, “పుష్ప 2” ఆ రికార్డును బ్రేక్ చేసి తనదైన ముద్ర వేసింది. షారుక్ ఖాన్ “జవాన్,” (Jawan) “పఠాన్” సినిమాలు 3.1 కోట్లు, 2.8 కోట్ల ఫుట్‌ఫాల్స్ నమోదు చేసినా, బన్నీ మూవీకి వచ్చిన ఆదరణ ప్రత్యేకమైనది. ప్రేక్షకుల స్పందనను చూస్తే, నార్త్ లో “పుష్ప 2” తన స్థాయిని మరింత పెంచిందని స్పష్టమవుతోంది.
“పుష్ప 2” విజయం సుకుమార్ (Sukumar) డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్, బన్నీ మ్యాజిక్ కాంబినేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా కథనంలో మాస్ ఎలిమెంట్స్, డీల్ చేసిన ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశారు. పైగా హిందీ ప్రేక్షకులు సినిమాను రిపీట్ ఆడియెన్స్‌గా చూస్తూ, కలెక్షన్లను రెండింతలు చేశారు. ఇదే టాప్ 5 జాబితాలో మరిన్ని దక్షిణాది సినిమాలకు ప్రేరణగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
పుష్ప 2: ది రూల్ | 4 కోట్లు |
గదర్ 2 (Gadar 2) | 3.4 కోట్లు |
స్ట్రీ 2 (Stree 2) | 3.2 కోట్లు |
జవాన్ | 3.1 కోట్లు |
పఠాన్ | 2.8 కోట్లు |
హిందీ మార్కెట్‌లో ఇంతటి విజయాన్ని సాధించడం కేవలం మంచి కంటెంట్ మాత్రమే కాకుండా, బన్నీ చేసిన ఆల్ రౌండ్ ప్రమోషన్‌తో కూడా సాధ్యమైంది. ఈ విజయంతో అల్లు అర్జున్ భవిష్యత్తులో తన స్థాయిని పెంచుకుంటూ, పాన్ ఇండియా స్టార్డమ్‌ను మరో లెవెల్ కు తీసుకు వెళతాడు అని చెప్పవచ్చు. నెక్స్ట్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.