Pushpa 2: అత్యధిక ఫుట్ ఫాల్స్ సాధించిన ఇండియన్ సినిమాలివే..!

భారతీయ సినిమా విజయాన్ని కొలిచే పద్ధతులు రోజుకోలా మారుతున్నాయి. గతంలో కేవలం వసూళ్లను చూసే పద్ధతి ఉండగా, ఇప్పుడు సినిమాను ఎంత మంది ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించారనేదే అసలు సక్సెస్‌ను నిర్ధారించే కీలకమైన అంశంగా మారింది. దీన్నే “ఫుట్‌ఫాల్స్” (Footfalls) అని పిలుస్తారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 (Pushpa 2: The Rule) ఈ లెక్కలన్నీ తారుమారు చేస్తూ, ఇండియన్ బాక్సాఫీస్‌లో అరుదైన రికార్డు సృష్టించింది.

Pushpa 2

ఒకప్పుడు థియేటర్లే ప్రధాన వినోద సాధనంగా ఉండేది. టికెట్ ధరలు తక్కువగా ఉండడం, ఇతర ఎంటర్టైన్‌మెంట్ ఆప్షన్లు లేకపోవడం వంటివి ప్రేక్షకులను ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు రప్పించేవి. అందుకే, 1975లో వచ్చిన షోలే సినిమా 12.73 కోట్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఇప్పటికీ ఓ అపరాజితమైన రికార్డు నెలకొల్పింది. అలాగే బాహుబలి (Baahubali) 2 10.77 కోట్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, ఈ శతాబ్దంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఓటీటీ, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువవ్వడంతో థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గినా, కొన్ని పాన్ ఇండియా సినిమాలు మాత్రం ఈ ట్రెండ్‌ను మార్చాయి. ఇటీవల పుష్ప 2 ఊహించని రీతిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. 6.12 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో ఈ సినిమా టాప్ 10 లిస్ట్‌లో చోటు సంపాదించింది. ఇది తెలుగు సినిమా గర్వించదగ్గ విజయంగా మారింది.

ఈ సినిమా కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ (Allu Arjun)  నటన, పుష్ప రాజ్ పాత్రతో పాటు, దర్శకుడు సుకుమార్ (Sukumar)  మేకింగ్ స్టైల్ సినిమాకు మాస్ అట్రాక్షన్‌ను తీసుకువచ్చాయి. దీంతో, ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన సినిమాల జాబితాలో పుష్ప 2 కూడా చేరింది.

అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలు:

1. షోలే – 12.73 కోట్లు

2. బాహుబలి 2 (Baahubali 2) – 10.77 కోట్లు

3. మగల్-ఎ-ఆజం – 9.17 కోట్లు

4. మదర్ ఇండియా – 8.89 కోట్లు

5. హమ్ ఆప్‌కే హై కౌన్ – 7.79 కోట్లు

6. గంగా జమున – 6.36 కోట్లు

7. క్రాంతి – 6.15 కోట్లు

8. పుష్ప 2 – 6.12 కోట్లు

9. ముకద్దర్ కా సికందర్ – 6.07 కోట్లు

10. సంగం – 5.71 కోట్లు

ప్రభాస్ తోనే రెండోసారి.. దర్శకుడికి అడ్వాన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus