Pushpa 2 Movie: పుష్ప2 సినిమాపై లేటెస్ట్ అప్డేట్.. సినిమా మొదలయ్యేది అక్కడే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయం సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలైనప్పటికీ ఇంకా ఈ సినిమాకి ఏ విధమైనటువంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ పనులను మొదలు పెట్టనుంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.అయితే ఈ సినిమా షూటింగ్ పనులు ఎక్కడ జరుపుకుంటుందనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.అక్టోబర్ ఒకటవ తేదీ అల్లు రామలింగయ్య జయంతి కావడంతో అదే రోజున అల్లు ఫ్యామిలీ నిర్మించినటువంటి అల్లు స్టూడియోస్ ప్రారంభం కూడా జరగనుంది.

ఈ క్రమంలోనే అల్లు స్టూడియోస్ ప్రారంభించిన అనంతరం ఈ స్టూడియోలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇకపోతే పుష్ప సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇలా ప్రేక్షకుల అంచనాల మేరకు ఈ సినిమా ఉండబోతుందని అందుకు అనుగుణంగానే సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది.ఇకపోతే పుష్ప సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ సినిమాని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus