‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) సినిమా విడుదలకు ఇంకా గట్టిగా వారం మాత్రమే ఉంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి చాలా డౌట్స్ క్లియర్ కావడం లేదు. సినిమా షూటింగ్ అయితే అయిపోయింది అని టీమ్ చెబుతున్నా.. ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలి ఉందని అదే టీమ్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి అయితే సరేసరి. ఆ పనిని టీమ్ ముగ్గురు చేతిలో పెట్టింది అని టాక్. అందులో ఒకరి గురించి క్లారిటీ వచ్చిందట.
అవును… ‘పుష్ప : ది రూల్’ సినిమాకు సంబంధించిన సంగీతం పనులను దేవిశ్రీప్రసాద్‌తో (Devi Sri Prasad) పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు చేస్తున్నారని టీమే చెబుతోంది. మొన్నీమధ్య చెన్నై ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘టైమ్ టైమింగ్’ క్లారిటీ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే.. టీమ్ మ్యూజిక్ పని అప్పజెప్పిన వారిలో ఒకరైన సామ్ సీఎస్ (Sam C. S.) తన మ్యూజిక్ స్కోరును ఇచ్చేశారట. మరోవైపు అజనీష్ లోక్‌నాథ్ (B. Ajaneesh Loknath) కూడా ఒకట్రెండు రోజుల్లో ఇచ్చేస్తాడని అంటున్నారు.
ఇక తమన్ (SS Thaman) చేసిన నేపథ్య సంగీతం విషయంలో టీమ్ అంత సంతృప్తిగా లేదు అని అంటున్నారు. మరో వెర్షన్ చేయమని అతనికి చెబుదామన్నా అంత సమయం లేకపోయే సరికి ఏదో ఒకటి ఫైనల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అయితే ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక వెర్షన్ ఇచ్చిన నేపథ్యంలో నాలుగింటిలో ఒకటి ఓకే చేస్తారు అని చెబుతున్నారు. అది ఈ రెండ్రోజుల్లో అయిపోతుంది అని టాక్.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ (Sukumar) ఏ ప్రచారానికీ రావడం లేదు. ఇప్పుడు ఆర్‌ఆర్ రెడీ అయితే ఆయన మళ్లీ బిజీ అవుతారు. ఆ లెక్కన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa) తరహాలోనే రిలీజ్ ముందు రోజు మాత్రమే సుకుమార్ ప్రెస్ మీట్‌కి వస్తారు అని చెప్పొచ్చు. అయితే ఈ సమస్య ఉండదు అని నిర్మాణ సంస్థ ఆ మధ్య చెప్పింది. కానీ ఇప్పుడు అదే సమస్య సినిమాను వేధిస్తోంది.