‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) విడుదలకు ముందు నుంచే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగాయి. మొదట దేవిశ్రీ ప్రసాద్ పూర్తి వర్క్ అందించాడని అనుకున్నా, దర్శకుడు సుకుమార్ (Sukumar) , హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ముగ్గురు కొత్త సంగీత దర్శకులను తీసుకోవడం జరిగింది. ఈ జాబితాలో తమన్ (S.S.Thaman) , సామ్ సీఎస్ (Sam C. S.) , అజనీష్ లోక్‌నాథ్‌లు (B. Ajaneesh Loknath) ఉన్నారు. తమన్ చాలా తక్కువ సమయంలో తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినప్పటికీ, చివరికి ఆయన BGM సినిమా మొత్తంలో వాడలేదు.
ఇక అజనీష్ ఇచ్చిన ట్రాక్స్ కొంత అనుకూలమైనప్పటికీ, ఉపయోగించేందుకు సరిపోలలేదట. కానీ సామ్ సీఎస్ వర్క్‌లో కొన్ని భాగాలు సుకుమార్‌ను ఆకట్టుకోవడంతో వాటిని మాత్రమే ఉపయోగించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, జాతర ఎపిసోడ్లలో సామ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రత్యేకతను తీసుకువచ్చింది. ఈ ముగ్గురు సంగీత దర్శకులకు నిర్మాతలు అందించిన పారితోషకం పెద్ద చర్చకు దారి తీసింది.
తమన్, సామ్, అజనీష్ ముగ్గురికీ తలో కోటి రూపాయలు చెల్లించారు. ఈ ముగ్గురిలో ఇద్దరి పనిని పూర్తిగా ఉపయోగించకపోయినా, వారి కృషికి న్యాయం చేస్తూ పూర్తి పారితోషకం అందించారు. మొత్తం రూ.3 కోట్లు అదనపు సంగీతానికి ఖర్చు చేయడం పుష్ప 2కి ఉన్న అంచనాలను సూచిస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ కు (Devi Sri Prasad) మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చెల్లించిన మొత్తం దీనికి అదనంగా ఉంది. ఆయనకు చెల్లించిన మొత్తం రూ.6 నుంచి 7 కోట్ల మధ్య ఉండవచ్చని సమాచారం. టైటిల్స్‌లో దేవి పేరు ప్రధానంగా చూపించగా, సామ్ సీఎస్ పేరు అదనపు స్కోర్ విభాగంలో మాత్రమే కనిపించింది.