ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule) సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ, ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌లో 1500 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఈ సక్సెస్ తర్వాత అందరి దృష్టి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌పై పడింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ చిత్రానికి ఓటీటీ హక్కులను దక్కించుకుని, అనేక భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. కానీ పెద్ద సినిమాల విషయంలో థియేటర్ రిలీజ్ తర్వాత నాలుగు నుంచి ఐదు వారాల వ్యవధిలోనే ఓటీటీ లో వస్తుండటం విశేషం. పుష్ప 2 కూడా అదే ట్రెండ్‌లో జనవరి మొదటి వారంలో లేదా పొంగల్ కంటే ముందే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని అంచనా. లేటెస్ట్ టాక్ ప్రకారం జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కావచ్చని టాక్.
అయితే, థియేటర్లలో కలెక్షన్లు కొనసాగుతుండటంతో, స్ట్రీమింగ్ తేదీ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ నాటికి సినిమాను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ప్రస్తుత టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్‌లోనే అదరగొడుతోంది. రికార్డ్ స్థాయిలో నార్త్ ఇండియాలో హిందీ మార్కెట్‌ను కూడా శాసిస్తూ, హిందీ సూపర్‌స్టార్ సినిమాలను అధిగమించింది. దాదాపు ₹700 కోట్ల నెట్ వసూళ్లను దేశీయ మార్కెట్‌లో రాబట్టి, వరల్డ్ వైడ్‌గా ₹1450 కోట్లకు చేరువైంది.
బాహుబలి 2 (Baahubali 2) రికార్డ్‌ను మించేందుకు ఇంకా 300 కోట్ల దూరంలో ఉన్న ఈ సినిమా, థియేట్రికల్ లాంగ్ రన్‌ను సద్వినియోగం చేసుకుంటే మరో రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఓటీటీలో విడుదల కాగానే మరింతగా గ్లోబల్ రీచ్ పొందనుంది.