RC16: ఆయన వల్ల బ్రేక్ తప్పదా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  , ‘ఉప్పెన’ (Uppena)  ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)  దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా “RC16” (RC16 Movie)  పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో, ఉత్తరాంధ్ర నేపథ్యాన్ని ప్రతిబింబించే ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. మైసూరులో మొదటి షెడ్యూల్ పూర్తిచేసిన తరువాత సినిమా టీం కీలకమైన రెండవ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం కొన్ని అనూహ్య పరిణామాలు ఈ ప్రాజెక్ట్‌కు అంతరాయాన్ని కలిగిస్తున్నాయి.

RC16

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్  (Janhvi Kapoor) కథానాయికగా ఎంపిక కాగా, మ్యూజిక్ కోసం ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) పని చేస్తున్నారు. మరోవైపు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్  చెబుతున్నాయి. అదేవిధంగా, ఈ సినిమాకు మరింత బలాన్నిచ్చేలా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను (Shiva Rajkumar) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఆయన అనారోగ్యం కారణంగా, ప్రాజెక్ట్‌ కొన్ని వారాల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివన్న చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. డిసెంబర్ 24న ఆయనకు ఆపరేషన్ జరగనుంది.

ఆ తర్వాత నాలుగు వారాల పాటు అక్కడే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం. అందుకే, ఆయన రీషెడ్యూలింగ్ వల్ల “RC16” షూటింగ్ ఆలస్యం అవుతుందనే చర్చ నడుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే కథను గొప్పగా మలిచారని, శివన్న పాత్రకు కూడా ప్రధాన ప్రాధాన్యం ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” (Game Changer) ప్రమోషన్లలో బిజీగా ఉన్నా, “RC16″కు సంబంధించి ఈ మార్పులపై తన టీంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

శివరాజ్ కుమార్ తరువాత ఫిబ్రవరిలోనే షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం సినిమాకు ఎంత వరకు ప్రభావం చూపుతుందో అనేది అనుమానంగా ఉంది. “RC16” వంటి భారీ ప్రాజెక్ట్‌లో షెడ్యూళ్లలో మార్పులు సాధారణమైనవే కానీ, ఇలాంటి పరిస్థితులు దర్శకుడి ప్లానింగ్‌ను క్లిష్టతరం చేయవచ్చు.

పుష్ప 2: ఇంకా టార్గెట్స్ పూర్తవ్వలేదు సామీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus